RRR Vs Jagan: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక రానుందా? డిప్యూటీ సీఎం రఘురామరాజు ఎందుకు అలా అన్నారు? జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పరుగు పొగొట్టుకున్న వైసీపీ, మళ్లీ ఆ ఛాన్స్ అధికార పార్టీకి ఇస్తుందా? ఇంతకీ జగన్ మదిలో ఏముంది? ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.
సెప్టెంబర్ మూడో వారం నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. దాదాపు రెండువారాల పాటు సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈసారైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా? డుమ్మా కొట్టబోతున్నారా? అదే జరిగితే ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు.
మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి జగన్ అర్హత లేదని భావించా లన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా సెలవు కోరకుండా రెండు నెలలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే వారిపై అనర్హత పడుతుందన్నారు. తాజాగా ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్‌ని అసెంబ్లీకి రప్పించడానికి డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు.
ALSO READ: ఇక అంబటి రాంబాబు వంతు.. ఆ 10 కోట్లపై ఆరా
ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా సెలవు కోరకుండా రెండు నెలలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే వారిపై అనర్హత పడుతుందన్నారు. తాజాగా ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్‌ని అసెంబ్లీకి రప్పించడానికి డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు.
ఈ పరిస్థితిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏ విధంగా అడుగులు వేస్తారో? ఎందుకంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మాజీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అన్నట్లు మూడు రోజుల కిందట అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారంపై నోరు విప్పారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. స్పీకర్‌గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తానని చెప్పకనే చెప్పారు.
ఇటీవల సీఎం చంద్రబాబు కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, ప్రజలు తిరస్కరించినప్పుడు తామేమీ చేయలేమన్నారు. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
జగన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు..
పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి అర్హత లేనట్లే భావించాలి
మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నా
– రఘురామకృష్ణంరాజు pic.twitter.com/dXqWptQRaa
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025