Rain Alert: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలకు ఊర్లు ఊర్లే మునిగిపోయాయి. భారీ ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర కార్యక్రమాలకు వెళ్లే వాహానాదారులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వాహనాలు అన్ని పడవలుగా మారుతున్నాయి. రోడ్లు అన్ని చేరువులుగా మారి ఏర్లై పారుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలి అంటేనే బయటపడుతున్నారు.
ఏపీలో మరో అల్పపీడనం..
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో అల్పపీడనం రాబోతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ వైపు కదిలేందుకు అవకాశముందని ఏపీ వాతావరణశాఖ చెప్పింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షం..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెబుతుంది. కృష్ణా, గోదావరి నదుల ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
తెలంగాణలో రాబోయే రెండు గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని తెలిపారు. ఈ ప్రాంతాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షం..
నేడు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణుల తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కోంది.
Also Read: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు.. వైసీపీ నేతల్లో వణుకు!
బయటకు రావొద్దు..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని, అంతేకాకుండా చెట్ల కింద అసలే ఉండకూడదని చెబుతున్నారు. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు అని పేర్కొంటున్నారు. అలాగే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.