BigTV English

AP News : ఏపీలో వజ్రాల KGF.. కమాన్ రాఖీ బాయ్స్..

AP News : ఏపీలో వజ్రాల KGF.. కమాన్ రాఖీ బాయ్స్..

AP News : ఏపీలో వజ్రాల వేట. పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది ఈ న్యూస్. ఇటీవలే ఓ వ్యక్తికి రూ.30 లక్షల విలువైన డైమండ్ దొరికింది. అప్పటి నుంచీ టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. ప్రతీ ఏడాది ఇంతే. వాన చినుకులు పడగానే మొదలవుతుంది సీమలో వజ్రాల వేట. కర్నూలు, అనంతలో మాత్రమే దొరుకుతాయి వజ్రాలు. ఒక్క రంగు రాయి దొరికినా.. వాళ్ల జీవితం మారిపోయినట్టే. లక్షాధికారి అయినట్టే. కోటీశ్వరులు అయినవాళ్లూ ఉన్నారు. అందుకే, ఈ సమయంలో వజ్రాల వేటకు చాలా క్రేజ్. ఇలాంటి వార్తలు చూసినప్పుడట్టా.. మనమూ వెళ్దామా? వజ్రాలు వెతుక్కుందామా? అనే ఆలోచన చాలామందికి వచ్చే ఉంటుంది. పెద్ద కష్టమేమీ కాదు. రోజంతా రాళ్లు వేరడమే పని. సో సింపుల్.


సీమలో వజ్రాల KGF..

కేజీఎఫ్‌లో బంగారు నిల్వలు ఉన్నట్టు.. మన కరువు సీమ నేలలో వజ్రాలు దాగున్నాయి. పారలు, బుల్డోజర్లు గట్రా అవసరం లేదు. చేతులతోనే వజ్రాలు ఏరుకోవచ్చు. కాకపోతే ఖరీదైన రాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి. వందలాది మంది ఆ ప్రయత్నం చేస్తుంటారు. కానీ, ఒక్క సీజన్‌లో ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే విలువైన డైమండ్ వరిస్తుంది. చాలామంది రంగురాళ్లతో, వట్టి రాళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.


ఇదే కరెక్ట్ టైమ్..

వేసవి తర్వాత తొలకరి చినుకులు వజ్రాల వేటకు కరెక్ట్ టైమ్. వాన కురిసిన మర్నాడే వేట మొదలెట్టేస్తారు. వర్షానికి భూమి పైపొర కొట్టుకుపోవడంతో.. కింద ఉండే వజ్రాలు మెరుస్తూ బయటకు వస్తాయి. మట్టి తవ్వాల్సిన పని లేకుండానే.. పైపైనే కనిపిస్తుంటాయి. రైతుల పొలాల్లోనూ ఉంటాయి. ఉదయం నుంచి చీకటి పడే వరకూ అదే పని మీద ఉంటారు చాలామంది. స్థానికులతో పాటు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు సైతం వజ్రాల కోసం వెతుకుతుంటారు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి.. లక్కీ స్టోన్ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. వాళ్ల మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అదృష్టం బాగుండి.. వజ్రం కంట పడితే.. యురేకా… అంటూ పెద్దగా అరిచి ఎగిరి గంతేశారో.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. డైమండ్ దొరికితే జేబులో వేసుకుని సైలెంట్‌గా అక్కడి నుంచి వచ్చేయాలి. లేదంటే, దాడి చేసి దోచుకెళ్లే ముఠాలు కూడా ఉంటాయక్కడ. జాగ్రత్త. దొరికిన వజ్రాన్ని అమ్మడం కూడా అంత ఈజీ కాదు. అలా వజ్రాలు వెతకడం, అమ్మడం చట్టరిత్యా నేరం. అందుకే, చాటుమాటుగా స్థానిక వ్యాపారులకు అమ్మేస్తుంటారు. కానీ, వాళ్లు సగం ధరకే వజ్రాలు కొంటూ మోసం చేస్తున్నారు. ఇటీవలి ఘటనే తీసుకుంటే.. రూ.30 లక్షలకు ఓ రైతు నుంచి వజ్రాన్ని కొన్న స్థానిక వ్యాపారి.. దానికి బహిరంగ మార్కెట్లో రూ.60 లక్షలకు అమ్మాడని తెలుస్తోంది. గతంలో కూడా అలానే జరిగింది. ఓ రైతుకు తన పొలంలో పెద్ద సైజు వజ్రం లభించగా.. దానికి రూ.కోటిన్నర ధర కట్టి చేతిలో పెట్టాడు లోకల్ వ్యాపారి. కానీ, ఆ అత్యంత విలువైన డైమండ్‌ను ఆ తర్వాత రూ.3 కోట్లకు అమ్మేసుకున్నాడనే వార్త అప్పట్లో తెగ సంచలనమైంది. ఇలాంటి ఘటనకు అక్కడ కామన్. అందుకే, వజ్రం దొరికడం అదృష్టమైతే.. అమ్మడం ఓ టాలెంట్‌.

Also Read : వజ్రాలు ఎలా అమ్మాలి? ఎక్కడ అమ్మాలి?

వజ్రాలు దొరికే ప్రాంతాలు ఇవే..

ఏపీలో అనంతపురం, కర్నూలు జిల్లా నేలల్లో వజ్రాలు ఉన్నాయి. జొన్నగిరి, తుగ్గిలి లాంటి ప్రాంతాల్లో అధికంగా వజ్రాల వేట కొనసాగుతుంది. కృష్ణా నది తీరంలోనూ లభిస్తుంటాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని పలు గ్రామాలు, పరిటాల, నూజివీడు తదితర ప్రాంతాల్లో వజ్రాలు తరుచూ దొరుకుతుంటాయి. ఇంకేం.. అడ్రస్ తెలిసిందిగా. ఓ ట్రయల్ వేయొచ్చు.. ఏపీ వజ్రాల కేజీఎఫ్‌లో లక్ పరీక్షించుకోవచ్చు.. డైమండ్ దొరికిందో.. రాఖీ భాయ్‌గా ఫోజులు కొట్టొచ్చు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×