Devin Harjes: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో నిత్యం విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖుల వరుస మరణాలు అందరిని ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి తాజాగా హాలీవుడ్ నటుడు డెవిన్ హర్జెస్ (41) మరణించారు. అతి చిన్న వయసులోనే డెవిన్ మరణ వార్త హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన మంగళవారం న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ వెస్ట్ హాస్పిటల్‌లో మరణించారు . ఈ ఏడాది మొదట్లో ఈయన క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. ఇలా క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే మరణించడంతో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.
జంతువులంటే అమితమైన ప్రేమ…
డేవిన్ జూలై 1983లో టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో రాండీ మరియు రోసన్నే హార్జెస్ దంపతులకు జన్మించారు. ఈయనకు సోదరి ట్రిచ్ హార్జెస్ లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇతరుల పట్ల ఎంతో ప్రేమ, గౌరవభావంతో కలిగిన డేవిన్ జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు గుర్రాలు వంటి జంతువులను సంరక్షిస్తూ ఉండేవారు. నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి డేవిన్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ .. డల్లాస్ ఫోర్ట్ వర్త్ సన్నివేశం ద్వారా ఈయన తన రంగస్థలం వృత్తిని ప్రారంభించారు. అనంతరం న్యూయార్క్ వెళ్లి టెలివిజన్ రంగంలో పనిచేశారు. బోర్డ్ వాక్స్ ఎంపైర్, మానిఫెస్ట్, డేర్ డెవిల్ వంటి ధారావాహికల ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. డేవిన్ నటించిన బోర్డ్ వాక్స్ ఎంపైర్ రెండవ సీజన్లో లెజెండరీ బాక్సర్ జాక్ డెంప్సే పాత్రలో నటించి మరింత సక్సెస్ అందుకున్నారు. గోతం, ఆరెంజ్ ఈజ్ ది న్యూ బ్లాక్, డేర్‌డెవిల్, ఎలిమెంటరీ, మరియు బ్లూ బ్లడ్స్ వంటి చిత్రాలలో నటించి మరింత పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు..
ఆలస్యంగా వెలుగులోకి…
ఈ విధంగా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న డేవిన్ ఈ ఏడాది మొదటిలో క్యాన్సర్ కి గురి కావడంతో అప్పటినుంచి చికిత్స తీసుకుంటూ హాస్పిటల్ కి మాత్రమే పరిమితమయ్యారు. అయితే మంగళవారం ఈయన పరిస్థితి మరింత క్షీణించడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు అధికారకంగా వెల్లడించారు. అయితే ఈయన గత నెల 27వ తేదీని మరణించారని తెలుస్తుంది. ఇక ఈయన మరణ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి తీసుకువచ్చారు.ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డేవిడ్ 41 సంవత్సరాల వయసులోనే మరణించడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా డేవిన్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు. డేవిన్ ఒక మంచి నటుడు మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని తెలుస్తుంది.