BigTV English
Advertisement

AP : సీమలో వజ్రాల వేట.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఎలా అమ్మాలి? ఎక్కడ అమ్మాలి?

AP : సీమలో వజ్రాల వేట.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఎలా అమ్మాలి? ఎక్కడ అమ్మాలి?

AP : అనంతపురం, కర్నూలు జిల్లాలు. అక్కడి భూగర్భం వజ్రాలను దాచుకుంది. చిన్న వాన చినుకులకే వజ్రాలు నేలను చీల్చుకుంటూ బయటకు వస్తుంటాయి. జొన్నగిరి, తుగ్గలి వంటి ప్రదేశాలలో ఎక్కువగా వజ్రాలు కనిపిస్తాయి. చాలా మంది స్థానికులు, సందర్శకులు వజ్రాల కోసం వేటాడతారు. కానీ చాలా కొద్దిమందిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. వజ్రం దొరికిన వాళ్లు లక్షాధికారులే. కొన్నవాళ్లు మత్రం కోటీశ్వరులు. చాలా కిటుకు ఉంటుంది అందులో.


వజ్రాలతో మోసం..

లేటెస్ట్‌గా కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి కొల్హాపూర్ ప్రాంతంలో ఓ కూలీకి ఖరీదైన వజ్రం దొరికింది. స్థానిక వ్యాపారి ఆ వజ్రాన్ని రూ.30 లక్షలకు కొన్నాడు. కానీ, బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.60 లక్షలకు పైనే ఉంటుందని అంటున్నారు. గతంలోనూ అలానే జరిగింది ఓ రైతును తన పొలంటో బరువైన డైమండ్ దొరకగా.. సుమారు కోటిన్నరకు లోకల్ బ్రోకర్‌కు అమ్మేశాడు. అతడేమో అదే వజ్రాన్ని రూ.3 కోట్లకు పైగా ధరకు బడా వ్యాపారికి అప్పజెప్పాడు. జస్ట్ ఆ వజ్రాన్ని చేతులు మార్చినందుకే అతనికి దాదాపు కోటిన్నర ఆదాయం వచ్చింది. అలా ఉంటుంది అక్కడ దందా. కష్టం ఒకరిది లాభం మరొకరిది. ఏళ్ల తరబడి వెతికినా చిన్నపాటి వజ్రపు ముక్క కూడా దొరకని వాళ్లు ఎందరో ఉంటారు. ఒకవేళ ఎవరికైనా అమ్మే విధానం తెలీక నష్టపోతుంటారు. ఇంతకీ వజ్రం దొరికితే వెంటనే ఏం చేయాలి? బ్రోకర్ల చేతిలో మోసపోకుండా ఎలా అమ్మాలి? ఎంతకు అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనే విషయాలపై ఓ అవగాహన ఉంటే మంచింది.


వెంటనే అమ్మకండి..

వజ్రం కనిపించగానే.. మొదట యురేకా అంటూ గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేయకండి. దొంగలు, మోసగాళ్లు ఉంటారక్కడ. దాడి చేసి లాగేసుకోవచ్చు కూడా. సైలెంట్‌గా ఆ డైమండ్‌ను మీతో పాటు తీసుకెళ్లండి. వజ్రం దొరకగానే.. వెంటనే సమీపంలోని షాపునకు వెళ్లి.. ఎంతో కొంతకు అమ్మేసే ప్రయత్నం అస్సలు చేయొద్దు. మిమ్మల్ని చూసి ఆ వ్యాపారి మోసం చేసే అవకాశం ఎక్కువ. కర్నూలులో ధర చాలా తక్కువ చెబుతారు. వాస్తవ విలువ కోట్లలో ఉంటే.. లక్షల్లోనే ఖరీదు కడతారు. లక్షలు వచ్చేస్తున్నాయిగా అని ఆశపడి.. తొందరపాటులో వజ్రాన్ని అమ్మేస్తే.. లాస్ అయినట్టే. ఎందుకంటే దాని నిజమైన విలువ మనకు తెలీదు. తెలుసుకోకుండా ఆరాటంగా అమ్మేయవద్దు. మరేం చేయాలి?

వజ్రం విలువను తనిఖీ చేయించడం..

వజ్రం ఎంత విలువైనదో తెలుసుకోవడానికి, దానిని ముందుగా జెమ్స్ ఎక్స్‌పర్ట్ దగ్గరికి తీసుకెళ్లాలి. వజ్రం సైజు, మెరుపు, కలర్ చెక్ చేసి విలువను నిర్ధారిస్తాడు ఆ నిపుణుడు. హైదరాబాద్‌లో అలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యాలయాలను కూడా సంప్రదించవచ్చు.

Also Read : పెళ్లికొడుకు తలపై కొబ్బరి బొండాం పగలగొడితే..

చట్టం ఏం చెబుతోంది?

వజ్రాలను అనుమతి లేకుండా సేకరించడం, అమ్మడం రెండూ చట్టవిరుద్ధమే. అందుకే, ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కానీ, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కానీ వెళితే పూర్తి సమాచారం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాస్త్ర విభాగాన్ని కూడా సంప్రదించవచ్చు. ఈ పర్మిషన్లు గట్రా ఎవరు తీసుకుంటారులే అనుకునే చాలామంది స్థానిక వ్యాపారులకు ఎంతోకొంతకు అమ్మేస్తుంటారు. అలాకాకుండా కాస్త నిబంధనలు పాటిస్తే.. డబుల్ సొమ్ము సొంతం చేసుకోవచ్చు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×