Tirumala News: తిరుమల శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఓ భక్తుడు పెద్ద మొత్తంలో భారీ విరాళాన్ని అందించి తన భక్తిని చాటుకున్నాడు. ముంబైకి చెందిన ఈ భక్తుడు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందించారు.
తిరుమల శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం ఎందరో భక్తులు తిరుమలకు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని చర్యలు చేపడుతోంది. అయితే తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాదం అందిస్తారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్నప్రసాదం అందిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూను ఎంత పవిత్రంగా భావిస్తారో అంతే పవిత్రంగా శ్రీవారి అన్నప్రసాదాన్ని కూడా భక్తులు స్వీకరిస్తారు.
అన్నప్రసాదం అనంతరం భక్తులు కానుకలు సమర్పిస్తారు. రూపాయి కూడా విరాళంగా స్వీకరించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలకు సోమవారం శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైలోని ప్రసిద్ యునో ఫ్యామిలీ ట్రస్ట్ కు చెందిన తుషార్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు విరాళ డీడీని టీటీడీ అదనపు ఈవో ఛాంబర్ లో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
ఇక,
మే నెలకు సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం ఈనెల 21న ఉదయం 10:00 గంటల అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ సేవ, శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసం 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల అందుబాటులో ఉంటాయి. తిరుమల అంగప్రదక్షిణం టోకెన్ల బుకింగ్ కోసం 22న ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, వసతి కోటా (రూ. 10,000/-) దాతలకు బుకింగ్ కోసం 22న ఉదయం 11:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
Also Read: TTD News: టీటీడీ చైర్మన్ కు షాకిచ్చిన కేటుగాడు.. ఏకంగా ఆయన ఫోటోతో..
సీనియర్ సిటిజన్లు లేదా దివ్యాంగుల కోటా అదేరోజు మధ్యాహ్నం 3:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టిక్కెట్లు 24న ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. తిరుమల మరియు తిరుపతి వసతి కోటా 24న మధ్యాహ్నం 03:00 గంటల నుండి బుకింగ్ చేసుకోవచ్చు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 200 టిక్కెట్లు బుకింగ్ కోసం ఇదే సమయానికి అందుబాటులో ఉంటాయి. టిటిడి, స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ కోసం 25న ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు బుకింగ్ కోసం 25న ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.