BigTV English

OTT Movie : ప్రియుడ్ని భర్తగా అనుకునే మతిమరుపు భార్య… మెంటలెక్కించే లవ్ స్టోరీ

OTT Movie : ప్రియుడ్ని భర్తగా అనుకునే మతిమరుపు భార్య… మెంటలెక్కించే లవ్ స్టోరీ

OTT Movie  : ప్రేమను వర్ణించడం కంటే, అనుభవిస్తేనే దాని లోతు ఎక్కువగా తెలుస్తుంది. అయితే ఇవి కొన్ని విషాదాలకు దారితీస్తే, మరికొన్ని మంచి ముగింపు ఇస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రెండు కలిపి ఉంటాయి. ప్రేమించిన అమ్మాయి అల్జీమర్స్ అనే వ్యాధి వల్ల గతం మరచిపోతే, ఆమెను ప్రేమించే ప్రియుడి పడే వేదన మాటల్లో వర్ణించలేం. అటువంటి కథతో వచ్చిన ఒక కొరియన్ మూవీ, మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ కొరియన్ మూవీ పేరు ‘ఎ మూమెంట్ టు రిమెంబర్’  (A moment to remember). ఈ కొరియన్ రొమాంటిక్ మూవీలో జంగ్ వూ-సంగ్, సన్ యే-జిన్ నటించారు. ఈ మూవీ నవంబర్ 5, 2004న దక్షిణ కొరియాలో రిలీజ్ అవ్వడంతో పాటు, దేశీయంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ మూవీ జపాన్‌లో కూడా విజయవంతమైంది. అక్కడ విడుదలైన కొరియన్ చిత్రాల మునుపటి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీ 2012లో టర్కిష్‌లో ‘ఎవిమ్ సెన్సిన్’ పేరుతో రీమేక్ చేయబడింది. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జూలీ తను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. అయితే ఎంతసేపు వెయిట్ చేసినా తన ప్రియుడు విక్కీ రాకపోవడంతో, డ్రింకు తాగడానికి ఒక షాప్ కి వెళ్తుంది. డ్రింక్ తీసుకొని డబ్బులు పే చేసి, డ్రింక్ ని అదే షాప్ లో మర్చిపోతుంది. మళ్లీ వచ్చి చూసేసరికి చార్లీ అనే వ్యక్తి డ్రింక్ ను తాగుతుంటాడు. తాను తీసుకున్న డ్రింకును తాగుతున్నాడనుకుని, వెంటనే దానిని తీసుకుని జూలీ తాగుతుంది. అయితే షాప్ కీపర్ ఆమె మర్చిపోయిన డ్రింక్ ని తనకి ఇస్తాడు. ఈ లోగా చార్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనికి క్షమాపణ చెప్పాలనుకుంటుంది జూలీ. అయితే అతను వెళ్ళిపోవడంతో, మరోవైపు విక్కీ కూడా రాకపోవడంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు విక్కీ రానందుకు, జూలీ చాలా బాధపడుతూ ఉంటుంది. జూలీని అలా చూసిన తండ్రి, ఆమెను వాళ్ల కంపెనీకి తీసుకువెళ్తాడు. నిజానికి జూలి తండ్రి ఒక పెద్ద బిల్డర్. చార్లీ కూడా అతని దగ్గర పని చేస్తుంటాడు. ఆ తర్వాత జూలీ ఫ్యాషన్ డిజైనింగ్ లో చేరుతుంది.

జూలీకి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒక వ్యక్తి అవసరం అవుతుందని తండ్రికి చెప్పడంతో, చార్లీ ని ఆమె దగ్గరికి పంపిస్తాడు. అలా వీళ్ళిద్దరి పరిచయం ప్రేమ వరకు దారి తీస్తుంది. మొదట ఆమె తండ్రి వీళ్ళ పెళ్లికి అంగీకరించడు. ఆ తర్వాత ఆమె చార్లీ ని గాఢంగా ప్రేమించడంతో ఒప్పుకోక తప్పలేదు. వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే కొద్ది రోజులకు ఆమెకు మతిమరుపు గట్టిగా వస్తుంది. ప్రాణంగా ప్రేమించిన చార్లీని కూడా మర్చిపోతుంది. ఆమెకు డాక్టర్లు అల్జీమర్స్ అనే వ్యాధి ఉందని చెప్తారు. బాగా ప్రయత్నిస్తే కోలుకునే అవకాశం ఉంది అని చెప్పడంతో, చార్లీ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. అయితే ఇదివరకే ప్రేమించిన విక్కీని తన భర్త అనుకుంటుంది జూలీ. ఇది తెలుసుకుని బాగా బాధపడతాడు చార్లీ. చివరికి ఆమె మతిమరుపు నయం అవుతుందా? చార్లీని పూర్తిగా మరచిపోతుందా? వీళ్ళ ప్రేమకి ముగింపు ఎలా పడుతుంది. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×