JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. తాజాగా తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేస్తూ జేసీ ఏకంగా ఒక ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి చేసిన అక్రమాలు, అరాచకాలను ఆ ఫ్లెక్సీ ద్వారా ప్రజలకు వివరిస్తూ జేసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరుగుతాయట..!
మాట్లాడే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో కేతిరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కేతిరెడ్డి కోడి రక్తం చూస్తేనే కళ్లు తిరిగి పడిపోతారట’ అంటూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా బూతులతో రెచ్చిపోయారు. ధర్మవరం నియోజకవర్గంలో నువ్వు ఎన్ని హత్యలు చేయించలేదని, నీ బాధితులు అక్కడ ఎంతోమంది ఉన్నారన్నారు. ప్రస్తుతం ధర్మవరంలో కేతిరెడ్డిని ప్రజలు ఛీ కొడుతున్నారని తెలిపారు. త్వరలోనే అక్కడి ప్రజలు ఆయనపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జేసీ జోస్యం చెప్పారు.
పెద్దారెడ్డి భద్రతపై సంచలన ప్రకటన
ఈ సందర్భంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాన్ని కూడా జేసీ ప్రస్తావించారు. ‘మీ నాన్నను చంపితే మీకు దిక్కు లేదురా నాయనా.. పెద్దారెడ్డిని ఎవరు హత్య చేసినా నాదే బాధ్యత, నేనే ముద్దాయిని అవుతాను’ అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాకుండా, పెద్దారెడ్డి కొడుకులు ఎంతమంది మహిళలపై దాడులు చేయలేదో నీకు తెలియదా అంటూ వెంకట్రామిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శలు ఇప్పుడు తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. దీనికి కేతిరెడ్డి వర్గం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.
కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డిని ఎవరు హత్య చేసినా తనదే బాధ్యతని జేసీ వ్యాఖ్యానించారు. ఎన్నో హత్యలు చేయించిన… pic.twitter.com/k69G7vSrBp
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2026
Also Read: పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయెుచ్చు: పవన్ కళ్యాణ్