Raptadu Accused: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో బాలికపై దాడి నిందితుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఎలా ఉన్నాడు? అర్థరాత్రి అతడికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ మాటేంటి? నిందితుడు హేమంత్ బతికే ఉన్నాడా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఆపరేషన్ తర్వాత రెస్టు తీసుకుంటున్న నిందితుడి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో హైస్కూల్ విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గాయపడిన నిందితుడు హేమంత్‌ని గత రాత్రి 9.30 గంటల సమయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకొచ్చారు. అప్పుడు స్పృహ కోల్పోయాడు. ఒంటి నిండా రక్తం కనిపించింది. ఇక నిందితుడు పని అయిపోయిందని దాదాపుగా అందరూ భావించారు.
అర్థరాత్రి నుంచి నాలుగైదు గంటలు ఆపరేషన్ చేసిన వైద్యులు.. నిందితుడి శరీరంలోని బులెట్లను తొలగించారు. ఆపరేషన్ తర్వాత ఐసీయూ వార్డుకి తరలించారు. అక్కడి ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. రెండు కాళ్లకు ముడుకు కింద బాగంలో ఆపరేషన్ చేసిన కట్లు కనిపించాయి. ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
కాస్త తేరుకున్న తర్వాత అక్కడి నుంచి జనరల్ వార్డుకు వైద్యులు షిఫ్ట్ చేయనున్నారు. ప్రత్యేక భద్రత మధ్య నిందితుడికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగానే పోలీసులు నిందితుడ్ని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అంతకుముందు రోజు ఏం జరిగిందంటే.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకొస్తున్న సమయంలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో పలువురు పోలీసులపై దాడి చేశాడు. నిందితుడ్ని పట్టుకునేందుకు తొలుత కాలుపై కాల్పులు జరగపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితుడ్ని ఆదివారం రాత్రి అనంతపురం జిల్లా ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు.
రాప్తాడు పాఠశాల దాడి నిందితుడిపై పోలీసు కాల్పులు
అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దారుణంగా దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. దాడి అనంతరం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పారిపోవడానికి ప్రయత్నించగా… https://t.co/WqK21oPfoy pic.twitter.com/nJmtF8EetY
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2026