E-Paper
Advertisement

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!
Advertisement

Bigg boss Ashwini Sri:బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో తన అందాలతో.. ముద్దు ముద్దు మాటలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న అశ్విని శ్రీ (Ashwini Sree )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోయింది. తన అందం, ఆట, మాట తీరుతో ఆడియన్స్ ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. విజేత కాకపోయినా సరే మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోలలో సందడి చేస్తూ ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో సంచలనం సృష్టిస్తోంది. ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా వృత్తిపరమైన ,వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్న ఈమె తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తనకు కాబోయే వాడి గురించి పలు విషయాలు పంచుకుంది.

కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఇవే..

అశ్విని శ్రీ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ..” నాకు కాబోయే భర్త గ్లామర్ పరంగా ఎలా ఉన్నా పర్లేదు. నల్లగా ఉన్నా.. చూడడానికి చెండాలంగా ఉన్నా సరే.. నాకు ఓకే. కానీ అతనికి మంచి మనసు ఉండాలి. అతనికి డబ్బులు ఉన్నాయా? లేదా ?అన్నది నాకవసరం. ప్రస్తుతం నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. కానీ నన్ను చాలామంది ట్రై చేస్తున్నారని కూడా తెలుసు. అయితే వారు నా మనసుకు కూడా నచ్చాలి కదా.. ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మాయిల వెంట పడని అబ్బాయిలు ఎవరు ఉంటారు. నాలాంటి అందమైన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది.

బంపర్ ఆఫర్ ప్రకటించిన అశ్విని శ్రీ..

Advertisement

అయితే నన్ను బాగా చూసుకునేవాడు దొరికితే చాలు అతడికి డబ్బు ఉండాల్సిన పనిలేదు. అందం అక్కర్లేదు. అతడిని నేనే పోషిస్తాను అంటూ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది అశ్విని శ్రీ .మొత్తానికైతే అశ్విని శ్రీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఆడియన్స్ లో వైరల్ గా మారింది. ఇకపోతే ఇది పాత వీడియో అయినప్పటికీ నెట్టింట అభిమానులు దీన్ని మళ్లీ వైరల్ చేస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో అందంగా ఉండాలి.. ఉద్యోగం ఉండాలి.. డబ్బు ఉండాలి అనే కోరుకునే అమ్మాయిలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వారందరికీ ధీటుగా అశ్విని ఇలాంటి కామెంట్లు చేయడంతో ఆమెపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి

also read:8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

అశ్విని శ్రీ కెరియర్..

Advertisement

అశ్విని శ్రీ విషయానికి వస్తే.. కెరియర్ ప్రారంభంలోనే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. సహాయ నటిగా కూడా ఆకట్టుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్, బీటెక్ బాబులు, రాజా ది గ్రేట్, అమీర్ పేట వంటి చిత్రాలలో నటించిన ఈమె.. సినిమాలకే తన కెరీర్ ను పరిమితం చేయకుండా మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సీరియల్స్ లో కూడా కనిపించి మెప్పించింది. మొత్తానికి అయితే ఆల్ రౌండర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మకి సినిమాలలో మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

రోహిత్ పై ప్రశంసల కురిపించిన శివాజీ.. ఎలిమినేషన్ పై రియాక్షన్?

అరియానాకు పెళ్లి అయ్యిందా..? వీడియోతో ట్విస్ట్ ఇచ్చిందిగా సామి..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. రామరాజు పరిస్థితి ఏంటి..?

Illu Illalu Pillalu Today Episodes: అంజలికి టెన్షన్.. ప్రేమ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వల్లికి ఘోర అవమానం..

Karthika Deepam 2 Serial Today Episode November 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ప్లాన్ సక్సెస్ – కష్టాల్లో దీప, కార్తీక్    

Intinti Ramayanam Today Episode: రమ్య మాటతో కమల్ షాక్.. అమ్మోరిలా ఆరాధ్య.. ఇదేం ట్విస్ట్ సామి..

Big Stories

Advertisement
×