E-Paper
Advertisement

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. ఐదేళ్ల కొడుకుని చంపి.. హైదరాబాద్ దారుణమైన ఘటన

మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. ఐదేళ్ల కొడుకుని చంపి.. హైదరాబాద్ దారుణమైన ఘటన
Advertisement

Hyderabad City: మద్యం వారి జీవితాలనే కాదు..చివరకు కుటుంబంలోని పిల్లల జీవితాలను నాశనం చేస్తోంది. అతిగా మద్యం తాగిన మైకంలో ఐదేళ్ల కొడుకు గొంతు నులిమి చంపేశాడు కసాయి తండ్రి. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. అసలు ఘటన ఎలా జరిగింది?

హైదరాబాద్ దారుణమైన ఘటన

హైదరాబాద్ సిటీలోని బోరబండ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. శిల్పినగర్‌లో ఐదేళ్ల బాలుడు మృతి తీవ్ర కలకలం రేపింది. తండ్రి మద్యం మత్తులో చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. విద్యాసాగర్‌-దుర్గ దంపతులు. ఆదివారం రాత్రి క్యాటరింగ్ పనికి వెళ్లిన తల్లి దుర్గ, సోమవారం ఉదయం ఇంటికి వచ్చింది.

మద్యం మత్తులో ఐదేళ్ల కొడుకుని చంపిన తండ్రి

Advertisement

అప్పటికి ఇంట్లోని బాలుడు ఉలుకు పలుకు లేకుండా పడి వున్నాడు. కొడుకును ఎంత లేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించిన దుర్గ, స్థానికులకు చెప్పింది. కొడుకుని ఆ విధంగా చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. వారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు, తండ్రి విద్యాసాగర్ కొడుకు గొంతు నులిమి చంపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపించాయి.

తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడికి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని క్షుణ్నంగా చెక్ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీఆర్ఎస్‌ పెద్దల్లో భయం ఎందుకు?

Related News

బీజేపీ యాక్టివ్ కావడంతో రూటు మార్చిన బీఆర్ఎస్.. 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర, ప్రజలతో ఉండేందుకు..

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీఆర్ఎస్‌ పెద్దల్లో భయం ఎందుకు?

దూసుకొస్తున్న మురసు తుఫాను.. దక్షిణ ఏపీ వైపు చూపు, తెలంగాణలో భారీ వర్ష సూచన

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

Big Stories

Advertisement
×