E-Paper
Advertisement

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!

750ccతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంచలనం.. క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త బైక్!
Advertisement

Royal Enfield Himalayan 750: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో పవర్‌ ఫుల్ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. హిమాలయన్ 750 (Himalayan 750) పేరుతో విడుదల కానుంది.  ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ బైక్‌కు సంబంధించిన అధికారిక ఫోటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. దీంతో బైక్ డిజైన్, కలర్ ఆప్షన్లు, కొన్ని కీలక ఫీచర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, TPMS లాంటి అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.

హిమాలయన్ 750లో ప్రత్యేక ఫీచర్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటివరకు తయారు చేసిన మోటార్‌సైకిళ్లలో హిమాలయన్ 750 అతిపెద్ద ఇంజిన్ కలిగిన మోడల్‌గా నిలవనుంది. ఇందులో 750cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. అయితే, ఇంజిన్‌కు సంబంధించిన పూర్తి పవర్, టార్క్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా రైడర్ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్‌ ను కూడా అందించనున్నారు. కొత్త LED హెడ్‌లైట్ డిజైన్ కూడా ఆకట్టుకుంటోంది.

ఐదు కలర్ ఆప్షన్లు

Advertisement

హిమాలయన్ 750ను మొత్తం ఐదు రంగుల్లో తీసుకొస్తున్నారు. అంటార్కిటిక్ సిల్వర్, సైబీరియా వైట్, వైకింగ్ బ్రాంజ్, టెక్టోనిక్ బ్లాక్, అజ్టెక్ గ్రీన్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. వీల్ ఆప్షన్ల విషయానికి వస్తే.. కొన్ని వేరియంట్లలో అల్లాయ్ వీల్స్, మరికొన్నింటిలో ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఉండనున్నాయి. అంటార్కిటిక్ సిల్వర్ వేరియంట్‌లో అదనపు యాక్సెసరీలు కూడా కనిపిస్తున్నాయి. సైబీరియా వైట్, వైకింగ్ బ్రాంజ్ మోడళ్లలో కూడా ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఉండనున్నాయి. టెక్టోనిక్ బ్లాక్, అజ్టెక్ గ్రీన్ మాత్రం అల్లాయ్ వీల్స్‌ తో రానున్నాయి.

EICMA 2026లో పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను నవంబర్ 3 నుంచి ఇటలీలోని మిలన్‌ లో ప్రారంభమయ్యే EICMA 2026 ప్రదర్శనలో వెల్లడించనుంది. ఇంజిన్ పనితీరు, ఇతర సాంకేతిక వివరాలపై అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నవంబర్‌లో భారత్‌లో విడుదల..

Advertisement

భారత మార్కెట్‌లో ఈ బైక్ విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. నవంబర్ చివరిలో జరగనున్న మోటోవర్స్ 2026 కార్యక్రమంలో హిమాలయన్ 750ను దేశీయంగా పరిచయం చేసే అవకాశం ఉంది. అడ్వెంచర్ టూరింగ్ బైక్‌లను ఇష్టపడే వారికి ఈ మోడల్ మంచి ఆప్షన్ కానుంది.

Read Also: నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

Tags

Related News

అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు అమ్మిందంటే?

హ్యుందాయ్ ఐ20 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

అక్టోబర్ లో కార్ల అమ్మకాల జోరు, ఏ కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందంటే?

పండుగ సీజన్‌లో EV కార్లపై అదిరిపోయే డీల్స్.. టాటా నుంచి ఎంజీ వరకు లక్షల్లో ఆఫర్లు!

అక్టోబర్‌లో హ్యుందాయ్ అమ్మకాల జోరు.. ఒక్క నెలలో ఎన్ని వేల కార్లు అమ్మిందంటే?

మహీంద్రా కార్లకు పండుగ సీజన్ బూస్ట్.. అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

మారుతి అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 4 కొత్త కార్ల ఎంట్రీ!

Big Stories

Advertisement
×