Duvvada – Divvala: రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురి అంటే తెలియని వారే ఉండరు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయరంగంలో కంటే, దివ్వెలా మాధురితో జతకట్టిన సమయంలోనే రాష్ట్రస్థాయిలో పాపులారిటీ పెంచుకున్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం తెరమీదికి వచ్చిన సమయంలో దివ్వెలా మాధురి ఎంటరయ్యారు. అప్పటినుండి వీరిద్దరూ జంటగానే పలు ఛానల్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ బంధానికి సంబంధించి ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు గతంలో తిరుమల పర్యటన సమయంలో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే వివాహం చేసుకోనున్నట్లు మాధురి ప్రకటించారు.
అలాగే తిరుమలలో ఫోటోషూట్ జరుపుకున్నారన్న ఆరోపణలతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు కూడా నమోదు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డేను మాధురి ఘనంగా నిర్వహించగా, అంతే స్థాయిలో మాధురి పుట్టినరోజును కూడా శ్రీనివాస్ నిర్వహించారు. ఇలా ఈ జంట ఎక్కడికి వెళ్లినా వార్తల్లో నిలవడం విశేషం.
Also Read: Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి రోజుకు వేలల్లో కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులట
శనివారం మరో మారు ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురిలు జంటగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వారు స్వీకరించారు. అయితే గతంలో పలు వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఈసారి మీరు తిరుమల పర్యటనలో ఎటువంటి కామెంట్స్ చేయకుండా వెను తిరిగారు. తాము కేవలం శ్రీవారి దర్శనం కోసం వచ్చామని బదులిచ్చిన ఈ జంట, మీడియాతో మాట్లాడేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారు.