నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ వేపుడు పేరు చెబితేనే నోరూరి పోతుంది. అవి కనిపిస్తే చాలు పైన నిమ్మ రసాన్ని పిండుకుని తినడానికే ప్రయత్నిస్తారు. నిమ్మకాయలోని పులుపు, చికెన్ మటన్ లతో కలిసి మరింత రుచిగా అనిపిస్తుంది. అలాగే బిర్యానీలో కూడా నిమ్మకాయ చల్లుకొని తినేవారి సంఖ్య అధికమే. అయితే ఇలా నాన్ వెజ్ పై నిమ్మకాయ రసం చల్లుకొని తినడం ఆరోగ్యకరమేనా?
నిమ్మకాయను చూస్తే.. నోరూరు
నిమ్మకాయలు సహజంగా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఒక ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. అందుకే నిమ్మరసం వంటకాలపై చల్లగానే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. తినాలన్న కోరిక పెరుగుతుంది. ప్రత్యేకమైన అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందుకే మాంసాహారం, వంటకాలు కనిపిస్తే పక్కన నిమ్మకాయ ముక్కలు కూడా ఉంటాయి. దీంతో అబ్బాయి.. ఈ గరం గరం కర్రీలో నిమ్మకాయ పిండుకుని తింటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు.
చికెన్ + నిమ్మరసం కాంబినేషన్ మంచిదేనా?
ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా అని అంటున్నారు ఆహార నిపుణులు. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆ విటమిన్ మన జీర్ణక్రియకు ఎంతో మంచిది. మాంసం పై నిమ్మరసం చల్లుకొని తినడం వల్ల ఆ మాంసం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా మాంసం తినేటప్పుడు కచ్చితంగా నిమ్మరసాన్ని చల్లుకొని తినడం అలవాటు చేసుకోండి.
చికెన్.. మటన్‌లపై?
మరీ ముఖ్యంగా చికెన్, మటన్ వంటకాలపై నిమ్మరసం చల్లుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. కాబట్టి మాంసంలో ఉండే బ్యాక్టీరియాను ఈ నిమ్మరసంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నాశనం చేస్తాయి. కాబట్టి మాంసం పై నిమ్మ రసం చల్లుకొని తింటేనే మంచిది .మనకి హాని చేసే బ్యాక్టీరియాలని పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది.
బోలెడన్ని లాభాలు..
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి విటమిన్ సి పిండుకొని తినడం వల్ల మన శరీరానికి కావాల్సినంత విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఇది మనల్ని కాపాడుతుంది. నిమ్మకాయ తినమన్నారు కదా అని మరీ అధికంగా తినేయకండి. మాంసం పై అర ముక్క నిమ్మకాయను చల్లుకొని తింటే సరిపోతుంది.
మరీ ఎక్కువ వద్దు.. ఇంత చాలు..
ఆహారం పుల్లగా మారిపోతే పూర్తిగా తినలేరు. కాబట్టి అరబద్దా నిమ్మకాయను చల్లుకొని తింటే సరిపోతుంది అయితే తాజాగా ఉన్న చికెన్, మటన్ వంటకాలపైనే నిమ్మరసాన్ని చల్లుకొని తినడం ఆరోగ్యకరం. తాజాగా లేని మాంసం పై మాత్రం నిమ్మకాయ చల్లుకుని తినడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మాంసంతో పాటు నిమ్మకాయలోని పోషకాలు కూడా మన శరీరానికి చేరాలంటే రెండు ఒక స్పూన్ నిమ్మరసాన్ని చల్లుకుంటే సరిపోతుంది.
Also Read: మీ శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా? అయితే, డయాబెటిస్ కావచ్చు, వెంటనే…