Lakshmi Parvathi: పగలు లేదు రాత్రి లేదు.. నా ఫోన్ కు ఎప్పుడూ కాల్స్ వస్తున్నాయి. రోజుకు పదివేలకు పైగానే కాల్స్ పరంపర సాగుతోంది. అది కూడ నానా దుర్భాషలు మాట్లాడుతున్నారు. వారెవరో కాదు టీడీపీ కార్యకర్తలే అంటూ తన బాధను వెళ్లగక్కారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి. ఇది కరెక్ట్ కాదు.. మీ కార్యకర్తలకు మీరు చెప్పుకోండి అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంగా లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఆ తర్వాత మీడియాతో తన బాధ వెళ్లగక్కారు ఆమె.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తన ఫోన్ నెంబర్ ను ఎవరో సోషల్ మీడియాలో సెండ్ చేశారన్నారు. నెల రోజులుగా తనకు రోజుకు పది వేలకు పైగా కాల్స్ వస్తున్నాయన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తన ఫోన్ ఎప్పుడూ మోగుతూనే ఉందన్నారు. తనకు వచ్చిన కాల్స్ ను లిఫ్ట్ చేస్తే చాలు, చెప్పలేని మాటలు బూతులు తిడుతున్నారని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మీడియా ముఖంగా తన ఫోన్ కాల్స్ లిస్ట్ ను కూడ ఆమె ప్రదర్శించారు.
ఇదంతా టీడీపీ కార్యకర్తల పనేనని, వారే తనను వేధిస్తున్నట్లు తెలిపారు. కాల్స్ కట్ చేస్తున్నా, అదే తీరుగా కాల్స్ చేయడం వేధించడం టీడీపీ కార్యకర్తలకు పరిపాటిగా మారిందన్నారు. ఇన్ని కాల్స్ వస్తుండగా, తనవారి కాల్స్ కూడ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో గల సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో గల మంత్రి నారా లోకేష్ లు తమ కార్యకర్తలను కంట్రోల్ పెట్టుకోవాలని ఆమె సూచించారు.
Also Read: CM Chandrababu: జగన్ ఇలాకాలో.. సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్
తన భర్త నందమూరి తారకరామారావని, తనకు అందరి ముందు తాళి కట్టినా ఆ కుటుంబం తనను వెలివేసిందన్నారు. ఎన్టీఆర్ ను ఎవరు వేధించారో, ఆయన చావుకు కారకులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం లక్ష్మీపార్వతిని పలువురు నాయకులు కలిశారు. అయితే ఇలాగే కాల్స్ కొనసాగితే ఫిర్యాదు చేసేందుకు కూడ వెనుకాడనని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.