BigTV English

Duvvada Srinivas: మాట మార్చిన దువ్వాడ.. పవన్ కల్యాణ్ గురించి అప్పుడలా.. ఇప్పుడిలా..

Duvvada Srinivas: మాట మార్చిన దువ్వాడ.. పవన్ కల్యాణ్ గురించి అప్పుడలా.. ఇప్పుడిలా..

Duvvada Srinivas takes U turn in Pawan Kalyan Matter: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మాదిరిగా తయారైంది ఆయన వ్యక్తిగత జీవితం. భార్య వాణిని, కూతుళ్లను దూరం పెట్టి.. మాధురి అనే మహిళతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న విషయం బయటికొచ్చినప్పటి నుంచీ.. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయనకు ఇదేం బుద్ధి.. ఛీ..ఛీ అనుకుంటున్నారు విషయం తెలిసినవారంతా.


దువ్వాడ శ్రీనివాస్ – వాణి ల మధ్యలో మాధురి మంటపెట్టిందని వాణి తరఫు వారు అంటుండగా.. వాణి వల్లనే తామిద్దరం ఇలా ఉంటున్నామని, ఆవిడే భర్తను చూసుకుంటే తనకు రావలసిన అవసరం ఉండేది కాదని చెబుతోంది మాధురి. మరి ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమో వారికే తెలియాలి. ఏదేమైనా భార్యకు విడాకులివ్వకుండా, వాళ్లను పట్టించుకోకుండా ఇలా మరో మహిళతో ఉండటం వివాహ వ్యవస్థకు కళంకమని, బరితెగింపు అని పెదవి విరుస్తున్నారు ఏపీ ప్రజలు.

అయితే.. ఇప్పుడు రెండిళ్ల పూజారిగా మారిన దువ్వాడ శ్రీనివాస్ ఒకప్పుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వైవాహిక జీవితంలో వివాదం రావడంతో.. అమ్మా ! ఎంత పనైపోయిందంటూ.. మళ్లీ పవన్ కష్టమేంటో నాకిప్పుడు అర్థమైందని యూ టర్న్ తీసుకున్నారు.


Also Read: “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్

“ముగ్గురు పెళ్లాలున్నారు. మీకు కావాలంటే మీరూ చేసుకోండని పవన్ అన్నాడు. మూడు పెళ్లిళ్లు చేసుకునే సాంప్రదాయం మనది కాదు. హిందూ సాంప్రదాయానికి పవన్ తూట్లు పొడిచాడు. పవన్ కు అసలు నాయకత్వ లక్షణాలే లేవు.” ఇవి దువ్వాడ శ్రీనివాస్ గతంలో చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడేమో “పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి దారితీరిన పరిస్థితులేంటో మనకేం తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితే నాకూ వచ్చింది కాబట్టి నాకు అర్థమైంది. సమస్య నా వరకూ వస్తేగాని తెలియలేదు. పవన్ కల్యాణ్ 2,3 వివాహాలకు దారితీసిన పరిస్థితులేంటో నాకు సరిగ్గా తెలీదు కానీ.. ఏదో కారణం ఉండబట్టే ఆయన అలాంటి పని చేశాడని ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టీ అర్థమైంది” అని దువ్వాడ శ్రీనివాస్ మాట మార్చేశాడు.

మరోవైపు దివ్వెల మాధురి కూడా పవన్ కు తను అభిమానినని చెప్పారు. “స్కూల్ డేస్ నుంచి పవన్ అంటే ఇష్టం. ఇచ్ఛాపురంలో ఫోన్ లో కూడా మాట్లాడాను. జనసేన నుంచి ఆఫర్ కూడా వచ్చింది. పవన్ కల్యాణ్ గురించి ఏ రోజూ నేను చెడుగా మాట్లాడలేదు” అని మాధురి తెలిపారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×