BigTV English

TV Somanathan| కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్ నియామకం.. రాజీవ్ గౌబా రిటైర్మెంట్..

TV Somanathan| కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్ నియామకం.. రాజీవ్ గౌబా రిటైర్మెంట్..

TV Somanathan| ఆర్థిక మంత్రిత్వశాఖలో ఫైనాన్స్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టివి సోమనాథన్ ఐఎఎస్ దేశ తదుపరి కేబినెట్ సెక్రటరీ నియమితులయ్యారు. ఆగస్టు 30న ప్రస్తుత కేబినెట్ సెక్రటరీ రాజవ్ గౌబా పదవీకాలం పూర్తి కానుండడంతో అదే రోజు సోమనాథన్ కొత్త పదవి బాధ్యతుల చేపట్టనున్నారు.


గత సంవత్సరమే రాజీవ్ గౌబా పదవీకాలం పూర్తైనప్పటికీ ఆయనకు మరో సంవత్సరం పొడగింపు ఇచ్చారు. దీంతో రాజీవ్ గౌబా సుదీర్ఘకాలం పనిచేసిన కేబినెట్ సెక్రమటరీ రికార్డు సాధించారు. రాజీవ్ గౌబా 2019 ఆగస్టు 2019 నుంచి కేబినెట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆగస్టు 10, 2024న కేంద్ర ప్రభుత్వం సోమానాథన్ ను కేబినెట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. టివి సోమనాథన్.. తమిళ నాడు కేడర్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి.

కేబినెట్ సెక్రటరీ అంటే ఎవరు?
కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సెక్రటరీ పదవి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రధాన మంత్రికి వెన్నెముక లాంటి వారు కేబినెట్ సెక్రటరీ. దేశ పరిపాలన వ్యవహారాలలో ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం కేబినెట్ సెక్రటరీ ప్రథమ కర్తవ్యం. అందుకే కేబినెట్ సెక్రటరీ ఆఫీసు.. ప్రధాన మంత్రి కార్యాలయానికి సమీపంలోనే ఉంటుంది.


Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

టివి సోమనాథన్ బ్యాక్ గ్రౌండ్
టివి సోమనాథన ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి. 1965 మే 10న తమిళనాడు జన్మించిన సోమనాథన్ స్కూలు తమిళనాడులోనే పూర్తిచేశారు. ఆ తరువాత పంజాబ్ యునివర్సిటీ నుంచి బికాం డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత మాస్టర్స్ పూర్తి చేసి.. కలకత్తా యునివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పిహెచ్ డీ చేశారు. చదువుపై మక్కువతో ఆయన హార్వర్డ్ యునివర్సిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగామ్ లో డిప్లొమా కూడా చేశారు.
అంతేకాదు ఆయన చాలా చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ఇంగ్లాండ్ లోని చార్టర్డ్ అకౌంటెంట్స్, లండన్ చార్టర్డ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెనేజ్‌మెంట్ అకౌంటెంట్స్, చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇత్యాది సంఘాల్లో ఆయనకు సభ్యత్వం ఉంది.

కేంద్ర బడ్జెట్ 2021-22 రూపొందించడంలో సోమనాథన్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వెన్నుదన్నుగా ఆయన ఇంతకాలం నిలిచారు. 2017లో ఆయన కూతరు పెళ్లి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అతిథిగా విచ్చేయడం గమనార్హం. 2021లో ఆయన ఎక్స్ పెండిచర్ సెక్రటరీగా నియమితులయ్యారు. సోమనాథన్ కేబినెట్ సెక్రటరీగా 2026 వరకు కొససాగుతారు.

Also Read: Ticket Deposit Receipt| ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×