Sharwanand : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం సినిమా మంచి సక్సెస్ సాధించింది. అంత మంచి సినిమా శర్వానంద్ కెరీర్ లో ఉంది. కేవలం అది మాత్రమే కాకుండా గమ్యం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఒకే ఒక జీవితం వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు శర్వానంద్ చేశాడు. అలానే శర్వానంద్ కెరియర్ లో ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
వాస్తవానికి విజయ్ దేవరకొండకు అద్భుతమైన పేరు తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను మొదట చేయాల్సింది శర్వానంద్. స్వప్నా దత్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమా ఆడియో లాంచ్ లో చెప్పాడు. ఏదేమైనా కానీ శర్వానంద్ కు కొంత ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు లేదు. కానీ ప్రస్తుతం శర్వానంద్ పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది.
శర్వానంద్ సినిమా వచ్చి నేటికి చాలా రోజులు అయిపోయింది. ఒకే ఒక జీవితం అనే సినిమాతో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు శర్వా. శర్వానంద్ లో టాలెంట్ ఎంత ఉంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.
కానీ దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. యూవీ క్రియేషన్స్ తో చేయాల్సిన స్పోర్ట్స్ డ్రామా స్టార్ట్ చేశారు. బట్ ఆగిపోయింది. సంపత్ నందితో ఇంకా స్టార్ట్ చేయలేదు. మంచి టాలెంట్ ఉన్న నటుడు సినిమాలు ఎలా మధ్యలో ఆగిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ప్రస్తుతం ఏం చేయాలో తెలియని స్థితిలో శర్వానంద్ ఉన్నారు అనేది సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకునే టాపిక్.
ఒకపక్క చేసిన సినిమాలు లైన్లో ఉన్నాయి. మరోవైపు చేయవలసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సగం లోనే ఉన్నాయి. మరోవైపు గ్రేట్ సక్సెస్ ప్రస్తుత కాలంలో శర్వానంద్ కి లేకపోయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆయన ఏ మాత్రం తగ్గట్లేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమా చేశాడు శర్వా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఇక నారి నారి నడుమ మురారి సినిమాతో ఊహించిన సక్సెస్ అందుకుంటాడేమో వేచి చూడాలి.
Also Read : AA22xA6 : అట్లీ-అల్లు అర్జున్ రేంజ్ సినిమా చేస్తా.. కొరియోగ్రాఫర్ ఓపెన్ ఛాలెంజ్