E-Paper
Advertisement

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు

జగన్‌ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు.. ఈడీ పిటిషన్‌.. వైసీపీలో కొత్త టెన్షన్ మొదలు
Advertisement

Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. రోజువారీ విచారణ కోసం జగన్‌‌తోపాటు నిందితులను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని ఈడీ పేర్కొంది. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.

జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు

జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని అందులో దాఖలు చేసింది. విచారణ సమయంలో జగన్ తోపాటు మిగతా నిందితులు అంతా వ్యక్తిగతంగా హాజరయ్యేలా చూడాలని ప్రస్తావించింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు గడిచిన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో ఈ కేసు విచారణ ముందుకు వెళ్లడం లేదని తెలిపింది.

విచారణ వేగంగా తేల్చాలని తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్

Advertisement

ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిగణించాలని కోరింది. ఇటీవల ఈడీ పిటిషన్లపై విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు. జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలో పిటిషన్లు దాఖలైనట్టు గుర్తించింది హైకోర్టు. హరిరామజోగయ్య, మిగతా పిటిషన్లతో కలిపి జత చేయాలని ఈడీని  ఆదేశించింది. దీంతో అన్ని పిటిషన్లపై ఈనెల 13న అంటే మంగళవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు.

వైసీపీలో గుబులు మొదలు, ఏం జరుగుతుందోనని చర్చ

పిటిషన్ విచారించిన తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈడీ పిటిషన్ విషయం తెలియగానే వైసీపీలో గుబులు మొదలైంది. మరో ఏడాదిన్నరలో జగన్ పాదయాత్ర చేపట్టనున్న తరుణంలో ఇప్పుడు పాత కేసుల విచారణ ఇబ్బందిగా మారే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే పార్టీకి కష్టాలు తప్పవని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. మరి మంగళవారం హైకోర్టు తీర్పు చెబుతుందోనని అంటున్నారు.

Advertisement

ALSO READ: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

Related News

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు

గుడ్ మార్నింగ్ సీఎం అంటూ.. పోలీసుల మోహరింపు ఎందుకని షర్మిల ప్రశ్న

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×