E-Paper
Advertisement

‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !

‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !
Advertisement

Rashmika Mandanna :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ముచ్చటగా మూడోసారి నటిస్తున్న చిత్రం రణబాలి. పైగా వీరిద్దరి వివాహం తర్వాత చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. అందులోనూ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 8వ తేదీన రణబాలి మూవీ నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ చూసిన నారా లోకేష్ ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో నారా లోకేష్ పోస్ట్ కి రష్మిక మందన్న పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నారా లోకేష్ కి రష్మిక స్పెషల్ థాంక్స్..

నారా లోకేష్ రణబాలి ట్రైలర్ పై ప్రశంసల కురిపిస్తూ చేసిన పోస్టును.. రష్మిక రీ ట్వీట్ చేస్తూ..” నారా లోకేష్ గారు, మీ మంచి మాటలకు, ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు చ ధన్యవాదాలు. రణబాలి సినిమా ఒక ముఖ్యమైన కథ. మన చరిత్రలోని ఒక అధ్యాయానికి జీవం పోసింది. అలాగే జయమ్మ పాత్ర పోషించడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమా మనందరికీ చాలా ప్రత్యేకమైనది” అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

రణబాలి మూవీ ట్రైలర్ పై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

Advertisement

రణబాలి మూవీ ట్రైలర్ పై నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక స్పెషల్ ట్వీట్ షేర్ చేశారు..”రణబాలి మూవీ ట్రైలర్ ను ఇప్పుడే చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గొప్ప అనుభూతిని కలిగించింది. 1800ఏళ్ల నాటి రాయలసీమను పునః సృష్టించడంలో చూపించిన వివరాలు, బ్రిటీష్ యుగం నాటి ఆ హృదయ విధారక పరిస్థితులను చిత్రీకరించిన తీరు చాలా అద్భుతం”. అంటూ రణబాలి చిత్ర బృందంపై నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.

also read:అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

నారా లోకేష్ కి కృతజ్ఞతలు చెప్పిన విజయ్ దేవరకొండ..

Advertisement

ఇకపోతే నారా లోకేష్ చేసిన ట్వీట్ కి విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. “లోకేష్ అన్న..సీమగడ్డ నాకు చాలా బాగా నచ్చింది. పైగా ఈ సినిమా నా నుండి రావాల్సిన సినిమా.. మీ సందేశం మా అందరిని మరింత ఉత్సాహంతో నింపేసింది. ఒక గొప్ప సినిమా అనుభవం మీకోసం వేచి ఉంది. మనభూమి, మన ప్రజల పట్ల మనలో గర్వాన్ని నింపే చిత్రం ఇది. మీకు నా శుభాకాంక్షలు.. మీరు మాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు” అంటూ తెలిపారు విజయ్ దేవరకొండ.

Related News

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

Big Stories

Advertisement
×