AP Schools: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన మొదలైందా? ప్రైవేటు సూళ్లకు ధీటుగా తయారు చేసే పనిలో ఆ శాఖ పడిందా? కేవలం టీచర్స్ వైపు కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు జవాబుదారీతనం ఉండేలా స్కెచ్ వేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది. అసలు మేటరేంటి? అన్న విషయానికి వద్దాం.
పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ విద్యా శాఖ. పాఠశాలకు మూడు రోజులకు మించి విద్యార్థి రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వాలన్నది అందులో ముఖ్యమైన పాయింట్. విషయం తెలుసుకుని విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చేయాలన్నది అసలు ఉద్దేశం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఐదు రోజులు దాటిన తర్వాత బడికి రాకపోతే నేరుగా ఎంఈవో-MEO, సీఆర్‌పీ- RPలు విద్యార్థుల ఇంటికి వెళ్లాలని సూచించారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలన్నది అసలు పాయింట్. ఒకవేళ టీచర్లు సెలవులో ఉన్నట్లయితే దానికి సంబంధించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
శనివారం విజయవాడలో జిల్లా విద్యాధికారులు, అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు, అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించారు విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు. ఈ సమావేశంలో అధికారులను సమాచారం తీసుకున్న ఆయన, ఆ తర్వాత మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షన్స్ కేవలం ఉపాధ్యాయులకు ఉంటుందన్నారు.
ALSO READ: త్వరలో కొత్త రేషన్ కార్డులు.. అంతా రెడీ చేసిన ప్రభుత్వం!
విద్యార్థులకు ఆప్షనల్ సెలవులు ఉండవని తేల్చిచెప్పేశారు. విద్యార్థుల హాజరు శాతంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉదయం హాజరు నమోదు చేసి, ఎంఈఓలు, సీఆర్పీలు, డీఈఓలు, ఏపీసీలు పాఠశాలలను పరిశీలించాలన్నారు. సెలవు పెట్టకుండా గైర్హాజరు అయ్యేవారి జాబితా రెడీ చేయాలన్నారు.
పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకానికి 75 శాతం హాజరు ఉండాల్సిందేనన్నారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిసినా, ప్రైవేటు బడుల్లో కనిపిస్తే చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు.
గతంలో జవాబుదారీ తనం ఉండేది కాదని, ఇప్పుడు కొత్తగా వచ్చిందని అంటున్నారు. దీనివల్ల విద్యార్థులు రెగ్యులర్‌గా హాజరయితే కచ్చితంగా పాస్ అవుతారని అంటున్నారు. గతంలో చాలామంది విద్యార్థులకు పాఠశాలలో పేర్లు ఉండేవని, వారు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలీదని అంటున్ానరు.