Prabhas Vs Ranveer: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్నారు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ అసోసియేషన్ ఉంది. దీనికి తోడు చైనా, జపాన్ వంటి దేశాలలో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న ఈయన.. ‘బాహుబలి’ తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు.
డిసెంబర్ 5న ప్రభాస్ మూవీ..
అందులో భాగంగానే తాజాగా ప్రభాస్.. మారుతి (Maruthi) డైరెక్షన్లో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రభాస్ తన సినీ కెరియర్ లో తొలిసారి హార్రర్ జానర్లో సినిమా చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా వింటేజ్ లుక్ లో ప్రభాస్ ని చూపించబోతున్నారు మారుతి. ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . ఇప్పుడు ఈయనకు పోటీగా రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తన సినిమాను సిద్ధం చేస్తున్నారు.
ప్రభాస్ తో పోటీకి సిద్ధం అంటున్న రణ్ వీర్ సింగ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు రణ్ వీర్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఈయన నటిస్తున్న ‘దురంధర్’ సినిమా నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ ఐదవ తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ వర్సెస్ రణ్ వీర్ అన్నట్టుగా వాతావరణం ఏర్పడనుంది. మరి ఇద్దరూ లెజెండ్రీ దిగ్గజ నటులు ఒకేరోజు తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఇద్దరిలో ఎవరు తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తారు? బాక్స్ ఆఫీస్ వద్ద గెలిచేది ఎవరు? అనే విషయం తెలియాల్సి ఉంది.
రణ్ వీర్ సింగ్ దురంధర్ సినిమా విశేషాలు..
దురంధర్ సినిమా విషయానికి వస్తే.. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా చేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ మూవీకి పోటీగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.
ALSO READ:Mrunal Thakur: ఆ క్షణం ట్రైన్ నుంచి దూకి చచ్చిపోవాలనుకున్నా- మృణాల్