BigTV English

Election Commission : రెండో రోజు ఈసీ సమావేశం.. ఓటర్ల జాబితాపై సీఈవో ప్రజెంటేషన్..

Election Commission : విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై నోవాటెల్‌‌లో రెండో రోజు సమావేశం నిర్వహించింది. సీఈసీ రాజీవ్‌కుమార్‌ అధ్యక్షతన వివిధ అంశాలపై ఎన్నికల సంఘం అధికారులు చర్చించారు. ఎన్నికలు నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను ఆయన ప్రజెంటెషన్ లో వివరించారు.

Election Commission :  రెండో రోజు ఈసీ సమావేశం.. ఓటర్ల జాబితాపై సీఈవో ప్రజెంటేషన్..

Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో రెండో రోజు సమావేశం నిర్వహించింది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికలు నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఓటర్లు జాబితా‌పై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటి వరకు పరిష్కరించిన వివరాలు వెల్లడించారు.


2023 డిసెంబర్ 9 వరకు వచ్చిన ఓటర్లు ఫిర్యాదులు, దరఖాస్తులను పరిష్కరించామని ముకేశ్ కుమార్ వివరించారు. 2023 డిసెంబర్ 9వ తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా రెండు రోజుల్లో పరిశీలిస్తామన్నారు. మృతి చెందినవారి ఓట్లు, బోగస్ ఓట్లను తొలగించామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులతో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామని తెలిపారు. అందులో 5.64 లక్షల ఓటర్లను అనర్హులుగా గుర్తించామన్నారు. ఆ ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల అధికారులకు వివరణ ఇచ్చారు. ఫాం-7లను అనేకసార్లు దాఖలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.

కాకినాడ జిల్లా , పర్చూరు, గుంటూరు జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా‌ల్లో ఫాం-7 దుర్వినియోగంపై కేసులు నమోదు చేసామన్నారు. ఫాం-7 దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల జాబితాలో అక్రమాలకు పాల్పడిన ప్రొద్దుటూరు , ఉరవకొండ నియోజకవర్గాల ఈఆర్‌వోలు, పర్చూరు ఏఈఆర్‌వో, ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను సస్పెండ్ చేశామని చెప్పారు. ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడిన 50 మంది బీఎల్‌వోలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.


ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు జరుగుతున్న అధికారుల బదిలీలను పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల అధికారులకు ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు, రాష్ట్ర పోలీసు విభాగం నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి ఎన్నికలు నిర్వహణ వరకు భద్రతా విషయాలు సీఈసీ అధికారులు పలు సూచనలు ఇచ్చారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×