BigTV English

Red ant Chutney : ఎర్ర చీమల చట్నీ.. రోట్లో రుబ్బి తింటుంటే..!

Red ant Chutney : చట్నీ అంటే ఇష్టపడవని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. అసలు కొందరైతే చట్నీ కోసమే టిఫిన్ చేస్తుంటారు. ఇక ఆ చట్నీ టేస్టుగా ఉంటే.. టిఫిన్ కేకో కేక. ఇడ్లీలో పల్లీ చట్నీ, ఉప్మా పెసరట్టులో అల్లం చట్నీ ఇలా అదిరిపోయే కాంబీనేషన్.. మరి ఎర్ర చీమల చట్నీ ఎప్పుడైనా తిన్నారా..?

Red ant Chutney : ఎర్ర చీమల చట్నీ.. రోట్లో రుబ్బి తింటుంటే..!

Red ant Chutney : చట్నీ అంటే ఇష్టపడవని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. అసలు కొందరైతే చట్నీ కోసమే టిఫిన్ చేస్తుంటారు. ఇక ఆ చట్నీ టేస్టుగా ఉంటే.. టిఫిన్ కేకో కేక. ఇడ్లీలో పల్లీ చట్నీ, ఉప్మా పెసరట్టులో అల్లం చట్నీ ఇలా అదిరిపోయే కాంబినేషన్. మరి ఎర్ర చీమల చట్నీ ఎప్పుడైనా తిన్నారా..?


ఎర్ర చీమలు అనగానే భయపడ్డారా? ఇదేమైనా చైనాలో అనుకుంటున్నారా? కానే కాదు.. మన దేశంలోని ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇది అన్నింటికీ సెట్ ఐపోయే పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌.. ఈ చట్నీ మన శరీరానికి ఓ ఔషధంగానూ పని చేస్తుందట. ఇక్కడున్న మరో వింత ఏమిటంటే ఈ చట్నీకి GI ట్యాగ్ కూడా వచ్చింది.

దేశంలోని ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంత ప్రజలు అటవీ ప్రాంతాల్లో దొరికే ఎర్ర చీమలను, వాటి గుడ్లను సేకరించి శుభ్రం చేస్తారు. అనంతరం అందులో కాస్త ఉప్పు, పచ్చిమిర్చి, మసాల దినుసులతో చట్నీ చేస్తారు. దీన్నే సమిలిపాల్ కై చట్నీ అని కూడా అంటారు.


ఈ ఎర్ర చీమల చట్నీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇది నిజానికి ఆఫ్రికా వాళ్ల ట్రెడిషనల్‌ చట్నీ.. అక్కడ దీన్ని సవాలీ చట్నీ అంటారు.

ఈ సవాలి పచ్చడి తయారు చేయాలంటే.. ఒక చెట్టును కోసి ఎర్రచందనం గూటిని తొలగించి ఆ తర్వాత చీమలు, గుడ్లు, కోడిగుడ్లకు ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో అల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మసాలా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.తర్వాత అల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ సవాలి పచ్చడి ఆరోగ్యానికి మంచిదని వారు భావిస్తారు.

ఈ చట్నీకి ఉపయోగించే చీమల్లో, విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. డిప్రెషన్, అలసట వంటివి రాకుండా చేస్తాయి. అలానే జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయని.. కంటి చూపు మెరుగువుతుందని చెబుతున్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకున్న ఒడిశాలోని మయూర్​భంజ్ సొసైటీ.. 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్​ యాక్ట్​ 1999 కింద చీమల చట్నీని GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. దీని ప్రత్యేకతను హైలైట్ చేస్తూ అప్లై చేశారు. మూల్యాంకనం తర్వాత.. దానిని ఆమోదించి.. ఆహార ఉత్పత్తుల వర్గీకరణలో ఈ చట్నీని అధికారికంగా పేరు సంపాదించుకుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×