BigTV English

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు..

Election Commission : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు ఎన్నికల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రకియను ఎన్నికల శాఖ ప్రారంభించింది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఈసీ ప్రస్తావించింది.

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి ఉపాధ్యాయులు..

Election Commission : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రకియను ఈసీ ప్రారంభించింది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఈసీ ప్రస్తావించింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.


టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరించాలని రాష్ట్రవాప్తంగా ఉన్న డీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11గంటల లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్నట్లు ఎన్నికల శాఖ ప్రకటించింది.

గతంలో ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అందుకే ఈ చర్య తీసుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపణలు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచేందుకు.. ప్రభుత్వం విద్యా హక్కు చట్టం నియమాల(2010)కు సవరణలు చేసిందని విమర్శించారు.


ఈ చట్టం ద్వారా ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కేవలం విద్యకు సంబంధించిన కార్యకలపాలకు మాత్రమే పరిమితం చేయాలని సృష్టం చేసింది.

కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 27 ప్రకారం జనాభా గణన, పార్లమెంటు ఎన్నికలకు, రాష్ట్ర శాసనసభలు, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, సంబంధించిన విధులకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యేతర పనులకు వారి సేవలు వినియోగించుకోకుడదని ఆదేశాలు జారీ చేసింది.

అయితే సెక్షన్‌-27లోని నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకే సవరణలు ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే టీచర్లను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల విధులకు దూరంగా పెట్టారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఎన్నికలలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకు వచ్చారని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×