BigTV English

Shiva Swamy Baba: ఏలూరులో కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

Shiva Swamy Baba: ఏలూరులో కారంతో  అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

Shiva Swamy Baba: కారం అంటే మనకు కారమే కదా.. జస్ట్ అలా కారం మన శరీరానికి తాకిందంటే చాలు.. కుయ్యో, మొర్రో అనాల్సిందే. కానీ ఇక్కడ ఓ బాబా వారు ఏకంగా కారంతోనే అభిషేకం చేయించుకున్నారు. అది కూడా భక్తులు ఏకంగా 50 కేజీల కారంను స్వామీజీపై పోయగా, స్వామి వారు అలాగే ఉండి పోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో..


ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమం ఉంది. ఈ వృద్ధాశ్రమంలో ప్రత్యంగిరా దేవి ఆలయం కూడా వెలసి ఉంది. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా.. ప్రత్యంగిరా దేవి ఇక్కడ ప్రాచుర్యం పొందారు. అలాగే ఇక్కడ శివస్వామి బాబా వారు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రత్యంగిరా దేవి అమ్మవారికి కారం అంటే ఇష్టమని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి భక్తులు కారం కూడా సమర్పిస్తుంటారు.

ఈ ఆలయంలో ఒక వింత ఆచారం కూడా మూడేళ్లుగా కొనసాగుతోంది. స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజు శివస్వామి బాబాకు ఇక్కడి భక్తులు కారంతో అభిషేకం చేస్తారు. అందులో భాగంగానే నిన్న రాత్రి బాబా వారికి కారంతో అభిషేకం చేశారు. ముందుగా గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో బాబా వారిని కుర్చీలో కూర్చోపెట్టారు. అనంతరం ఒక్కొక్క భక్తుడు, భక్తురాలు తమ చేతిలో కారం తీసుకొని శివస్వామి బాబా ఒంటిపై పోయడం ప్రారంభించారు.


Also Read: TTD News: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వనున్నారా.. జస్ట్ స్కాన్ చేస్తే సరి.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?

ఈ క్రమంలో అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ.. బాబా వారు భక్తులకు ఆశీర్వదించారు. సాధారణంగా మనకు కారం కొద్దిగా తగిలిన వెంటనే.. అమ్మో మంట అనే కేకలు వేస్తాం. కానీ బాబా వారు మాత్రం సాధారణంగా ఉన్నట్లుగానే అలాగే ఉండి పోయారు. ఈ సంప్రదాయానికి ప్రధాన కారణంగా కారం అంటేనే అమ్మవారికి ఇష్టమని, అందుకు ఈ పరంపర సాగిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారు ఎంతో మహిమ గల వారని, అందుకే శివస్వామి బాబా వారికి కారం ఎటువంటి ప్రభావం చూపలేదని భక్తులు తెలిపారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×