BigTV English

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఫైళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ చేట్టింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. కీలకమైన ఫైల్స్ మంటల్లో కాలిపోయాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు ఎవరో నిప్పు పెట్టారు. భూసేకరణకు సంబంధించి లబ్దిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడుతాయనే కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా కూడా వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


Also Read: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్

ఇదిలా ఉంటే.. ఇలాంటి ఓ ఘటన కూడా ఏపీలో ఇటీవలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడడంతో ఆఫీసులో ఉన్న కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుని మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. రాష్ట్ర డీజీపీ కూడా సంఘటనా స్థలిని సందర్శించి పరిశీలించారు. అనంతరం పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఘటనకు సంబంధించి పలువురు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


Related News

CM Chandrababu: హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మాణమే మా లక్ష్యం.. కేవలం ప్రారంభం మాత్రమే-సీఎం

Amaravati News: CRDA నూతన భవనం.. సీఎం చంద్రబాబు ప్రారంభం, కార్యకలాపాలు అమరావతి నుంచే

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Big Stories

×