Big Stories

EVM Damage Politics: బాక్స్ బద్ధలైంది.. ఏపీలో కొనసాగుతున్న వీడియో పాలిటిక్స్..

EVM Damage Politics Continues in AP: ఏపీలో ఈవీఎం బద్ధలుతో మొదలైన ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. అదిగో చూడండి వైసీపీ నేతల రౌడీయిజం అంటూ టీడీపీ నేతలు.. మరి వీటి సంగతేంటి అంటూ టీడీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తూ వైసీపీ.. ఇలా ఎవరికి వారే తాము రైటంటే.. తాము రైటంటూ చర్చలు జరుపుతున్నారు. అసలు ఈవీఎం ఘటన చెప్తున్నది ఏంటి? చర్చ దేనిపైనా జరగాలి? కానీ దేనిపై జరుగుతోంది?

- Advertisement -

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్ధలు కొట్టారు. దంతా ఈసీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో హెచ్‌డీ క్వాలిటీలో రికార్డైంది.. వీడియో బయటికి వచ్చింది. దానిపై పెద్ద వివాదమే జరిగింది. ఇదీ అందరికీ తెలిసిందే.. ఇక్కడ పిన్నెల్లి తప్పు చేశారన్నది క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. నిజానికి వైసీపీ నేతలు ఏం చేయాలి? పిన్నెల్లి చేసింది తప్పు.. దానికి తగిన చర్యలు తీసుకుంటాం అని అనౌన్స్ చేయాలి. నీ అలా చేశారా? లేదు. రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అసలు వీడియో బయటికి ఎలా వచ్చింది? అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. అయితే ఈ రాగానికి డోల్బీ లెవల్‌లో రీమిక్స్‌ అవ్వడానికి కారణం.. ఎలక్షన్‌ కమిషన్.. వారు సింపుల్‌గా అసలు మేము వీడియోను రిలీజ్ చేయలేదు. ఎక్కడి నుంచి లీక్ అయ్యిందో దర్యాప్తు చేస్తాం అని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అంతే.. వైసీపీ నేతలకు ఓ బ్రహ్మాస్త్రం దొరికినట్టుగా మారింది సీన్.. చూశారా.. వీడియో లీక్ వెనక టీడీపీ నేతల కుట్ర ఉంది. ఇప్పటికైనా నమ్ముతారా? అంటూ మొదలుపెట్టారు.

- Advertisement -

సరే.. నిజంగానే టీడీపీ నేతలే లీక్ చేశారని అనుకుందాం. వాట్.. అందులో ఉన్నది పిన్నెల్లినే కదా.. మరి దాని సంగతేంటి? దానిపై ఒక్క మాట మాట్లాడరేందుకు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.. మేము ఇక్కడ ఏ పార్టీకి వకల్తా పుచ్చుకోవడం లేదు. వారి తరపున ప్రశ్నలు వేయడం లేదు. నాలో ఉన్న డౌట్స్‌ను మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ చేస్తున్నాం.. మళ్లీ మాకు ట్యాగ్‌లైన్స్‌ వేసి.. కండువాలు కప్పకండి. ఎందుకంటే ఈవీఎంను పగులకొట్టడమంటే.. ప్రజల అభిప్రాయాలను ధిక్కరించడమే. మనం ఉన్నది రాజరీకంలో కాదు కదా.. ప్రజల అభిప్రాయం ఏదైనా దాన్ని గౌరవించాలి కదా. ఈవీఎంను పగులగొట్టడం అనేది ముమ్మాటికీ తప్పే.. అది ఏ పార్టీ వారు చేసినా..

Also Read: యూఎస్ లో జడ్జిగా ఏపీ మహిళ.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి..

ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ఇదిగో చూడండి టీడీపీ నేతలు ఈవీఎంను ఎలా ధ్వంసం చేస్తున్నారో అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే ఫేక్ వీడియో కాదు.. నిజమైనదే.. బట్ ఈ ఎన్నికలకు సంబంధించినది మాత్రం కాదు. 2019 ఎన్నికల్లో జనసేన నేత మధుసూదన్ గుప్తా ఓ ఈవీఎంను ధ్వంసం చేశారు. అదిగో ఆ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ.. పిన్నెల్లిని మాత్రమే అంటున్నారు.. టీడీపీ నేత చేసిన పనిని చూడండి.. అంటూ వైరల్ చేస్తున్నారు.

దెబ్బకు దెబ్బ.. కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌ అన్నట్టుగా సాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్..
నిజంగా వైసీపీ నేతలకు అది ఇప్పటి వీడియో అని తెలియదా? లేక తెలిసి కూడా కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశమా? ఇది వారికే తెలియాలి.. కానీ ఇదైతే ఈ ఎన్నికల వీడియో కాదు. ఇదైతే కన్ఫామ్.. అందులో నో డౌట్.. దీనికి మాది హామీ..

ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో హింసను ఎగదోసింది ఎవరు? ఎవరు ప్రజలను ఉసిగొల్పారు? దాడులకు ఎవరు ప్రేరేపించారు? సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని , వీడియోలను ఎవరు వైరల్ చేశారు? ఇందులో వైసీపీ నేతలు ఉండవచ్చు.. టీడీపీ నేతలు ఉండవచ్చు.. అందరి లెక్కలు తీయాలి.. అవసరమైతే ఊచలు లెక్క పెట్టేలా చేయాలి.. అప్పుడే మరోసారి ఏపీలో విధ్వంసకాండ జరగదు..
అప్పుడే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే ప్రజల నిర్ణయం సరైనదిగా ఉంటుంది. అలాంటి రోజు రావాలంటే.. ఇప్పుడు దురాగతాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే.. ఇదే ఏపీ ప్రజలు కోరుకుంటున్నది.. బిగ్ టీవీ ఆశిస్తున్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News