BigTV English

Single Movie : మరి ఇంత చిన్న సినిమా ఏంటి శివయ్యా.?

Single Movie : మరి ఇంత చిన్న సినిమా ఏంటి శివయ్యా.?

Single Movie : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు ఒకరు. సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు సింగిల్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ విష్ణు చేసిన చివరి రెండు సినిమాలు ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలా మంది ఊహిస్తున్నారు. సినిమా మే 9న ప్రేక్షకులు ముందుకు రానుంది.


ఊహించని డ్యూరేషన్ 

మామూలుగా రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. అయితే చాలా సినిమాలకు సంబంధించి డ్యూరేషన్ విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా ఒక సినిమా రెండున్నర గంటలు ఉంటే పర్వాలేదు గానీ మూడు గంటలు ఉంటే చాలా మందికి డౌట్ వస్తుంది. అలా అని కేవలం రెండు గంటలు ఉన్నా కూడా డౌట్ వస్తుంది. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు మూడు గంటల పాటు సినిమా తీసిన దాన్ని చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది. రంగస్థలం మహానటివంటి సినిమాలు కూడా దాదాపు మూడు గంటల పాటు డ్యూరేషన్ ఉంటాయి. నాని నటించిన అంటే సుందరానికి సినిమా దాదాపు 3 గంటలు పాటు ఉంటుంది. ఇదే ఈ సినిమాకు మైనస్ అయింది. శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా డ్యూరేషన్ కేవలం 2 గంటల 5 నిమిషాలు మాత్రమే.


మరి ఇంత తక్కువ

రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి చాలా కాంట్రవర్సీ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ కి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. శివయ్య, మంచు కురిసిపోవడం ఇలాంటి డైలాగ్స్ వలన ప్రముఖ హీరో మనోభావాలు కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా డ్యూరేషన్ తెలిసిన వెంటనే మరీ ఇంత తక్కువ డ్యూరేషన్ ఏంటి శివయ్య అంటూ మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకొన్ని కాంట్రవర్సీలు జరిగే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మే 9న రిలీజ్ కాబోయే ఈ సినిమా కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Also Read : Vijay Devarakonda : గీత ఆర్ట్స్ కోసం బినామీగా మారుతున్న రౌడీ హీరో… తరుణ్ భాస్కర్‌తో కలిసి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×