BigTV English

Grandhi Srinivas Resign: ఒకటి కాదు, రెండు సార్లు.. అందుకేనా గ్రంథి శ్రీనివాస్ రాజీనామా?

Grandhi Srinivas Resign: ఒకటి కాదు, రెండు సార్లు.. అందుకేనా గ్రంథి శ్రీనివాస్ రాజీనామా?

Grandhi Srinivas Resign: వైసీపీకి ఒకొక్కరుగా నేతలు గుబ్ బై చెప్పేస్తున్నారు. గురువారం ఒక్కరోజు ఇద్దరు నేతలు రాంరాం చెప్పేశారు. అందులో ఒకరు విశాఖ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కాగా, లేటెస్ట్‌గా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వంతైంది. తాజాగా ఆయన పార్టీకి,  పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపారు.


వైసీపీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటున్నాయి. జగన్ తీసుకున్న సొంత నిర్ణయాలే పార్టీ కొంప ముంచిందంటూ నేతలు రుసరుసలాడుతున్నారు. ఈ క్రమంలో సొంతిల్లు చక్కబెట్టుకునే పనిలో పడుతున్నారు నేతలు. లేటెస్ట్‌గా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. రాజకీయాల పరంగా భీమవరం నియోజకవర్గానికి మాంచి గుర్తింపు ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పవర్ సెంటర్ లాంటింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా సైకిల్ పార్టీ ఒడిదుకులను ఎదుర్కొంటోంది. గతంలో టీడీపీ తరపున గెలిచారు పులవర్తి రామాంజనేయులు. మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గెలిచి, మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.


2019లో వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్.. పవన్ కల్యాణ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. దీంతో జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి వస్తుందని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండుసార్లు జరిగిన మంత్రి విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. చివరకు సొంత పార్టీ నుంచి వెన్నుపోటుదారులు తయారయ్యారు.

ALSO READ:  జగన్‌కు మరో షాక్, సరస్వతి పవర్‌ భూముల వెనక్కి

2024లో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు గ్రంథి శ్రీనివాస్. తన ఓటమి వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారని భావించారు. ఈ క్రమంలో అసంతృప్తి వ్యక్తం చేశారాయన. సీన్ కట్ చేస్తే.. భీమవరం నియోజకవర్గంలో గ్రూపులు మొదలయ్యాయి. ఒక వర్గానికి గ్రంధి, మరో వర్గానికి మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నాయకత్వం వహిస్తున్నారు.

ఛైర్మన్ మోషేన్ రాజు ఆధ్వర్యంలో జులైలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమానికి గ్రంధి వర్గం బహిష్కరించింది. తన వ్యాపారాలను సైతం పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలు పని చేశానని సన్నిహితుల వద్ద వాపోయారట గ్రంథి. ఇక ఈ పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారట.

నవంబర్‌లో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారట గ్రంథి. ఈలోగా ఆయన వ్యాపారాలపై ఐటీ దాడులు చేయడంతో సైలెంట్ అయిపోయారు. లేటెస్ట్‌గా గురువారం తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. టీడీపీలో ఆయన రూట్ క్లియర్ చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు జోరందకున్నాయి.

Related News

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Big Stories

×