BigTV English

Buddha Venkanna: నోరు ఉన్నోడిదే పవర్.. బుద్దాకు పెద్ద పోస్ట్..?

Buddha Venkanna: నోరు ఉన్నోడిదే పవర్.. బుద్దాకు పెద్ద పోస్ట్..?

EX MLC Buddha Venkanna to Get Big Post in TDP: అపార రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిలా బుద్దా వెంకన్న కలర్ ఇస్తారు. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం ఎరుగని బుద్దాకి పొలిటికల్‌గా నోరే ప్లస్ అవుతుంది. ఎంతటి వారిపైనైనా విరుచుకుపడిపోయే ఆ మాస్ ఇమేజే ఆయనకు టీడీపీలో ఎమ్మెల్సీని చేసింది. ఒక్క టర్మ్ ఎమ్మెల్సీగా చేసి బెజవాడ టీడీపీలో తానొక్కడే నాయకుడ్ని అన్నట్లు ఫీలైపోతుంటారాయన. ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుంటూ పార్టీకి తలనొప్పిగా మారతారుంటారు .. తాజాగా ఆయన చంద్రబాబు తనకు దేవుడంటూనే పదవి కావాలని డిమాండ్ చేయడంపై పార్టీలో విచిత్రమైన చర్చ మొదలైంది.


బుద్ధా వెంకన్న.. తనని తాను ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఫీలయిపోయే విజయవాడ టీడీపీ నాయకుడు. ఏ లాబీయింగ్ కలిసి వచ్చిందో ఏమో కాని ఆయన టీడీపీలో ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మామూలుగానే మాస్ ఇమేజ్ ఉన్న ఆయన దూకుడు దాంతో మరింత పెరిగిపోయింది. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కేశినేని నానికి చుక్కలు చూపించారు వెంకన్న.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి మద్దతుగా నిలిచి కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకు నిద్రపోలేదు.

బుద్దా వెంకన్న దూకుడు టీడీపీ ఎంత ప్లస్ అయిందో.. అంతే మైనస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లపై నోటికొచ్చినటలు చెలరేగిపోయే తాజా మాజీలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారిని తన స్టైల్లో టార్గెట్ చేస్తూ బుద్దా వెంకన్న తన మాస్ ఇమేజ్ మరింత పెంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ తన అనుచరులతో దండెత్తినప్పుడు. బుద్దా వెంకన్న అడ్డంపడి పార్టీలో మంచి మార్కులే కొట్టేశారు.


ఆ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన బుద్దా చాలా హడావుడే చేశారు..ఎన్నికలకు ముందు చంద్రబాబు చిత్రపటానికి తన రక్తం తీసి అభిషేకం చేసి కలకలం రేపారు. భారీ బల ప్రదర్శనతో ఇంద్రకిలాద్రీ కొండెక్కి టికెట్ కోసం మొక్కులు మొక్కుకున్నారు. అయినా వెంకన్నకు టికెట్ రాలేదు కాని.. అధిష్టానం మాత్రం అతి చేయవద్దని గట్టిగానే చీవాట్లు పెట్టిందంటారు

దాంతో ఎన్నికల్లో ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరిల విజయానికి బుద్దిగానే పనిచేశారాయన.. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండానే తన అసహనాన్ని బయటపెట్టు కుంటున్నారాయన.. తాజాగా ఎంపీ కేశినేని చిన్నిపుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు.

Also Read: వల్లభనేని వంశీకి లుకౌట్ నోటీసులు ?

ఆ సందర్భంగా మాట్లాడుతూ పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందని.. పార్టీ మారిపోయిన అయిదేళ్లలో పార్టీ కోసం ఎంతో చేశానని చెప్పుకొచ్చిన ఆయన.. తనపై వైసీపీ ప్రభుత్వం 37 కేసులు పెట్టిందన్నారు. సీఐల పోస్టింగ్స్‌తో ఆయనకు సంబంధం ఏంటో కాని పదవి లేకపోవడంతో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని తెగ ఫీలై పోయారు.

నా మాట చెల్లటంలేదు.. ఆవేదనగా ఉందని అంత బాధపడిపోయిన ఆయన.. కనీసం కార్యకర్తలకు టీటీడీ సిఫార్లు లెటర్లు ఇవ్వలేకపోతున్నానని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఎంత మంది తనలా పార్టీ కోసం పోరాటాలు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ఇఫ్పుడే ప్రకటించేశారు.

ఎమ్మెల్యే పదవి ఉంటేనే మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నానని 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తానని ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు… తాను చచ్చిపోయే వరకు టీడీపీలోనే ఉంటానని తన ఆవేదనను కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటూ.. పదవిపై తన మనసులో కోరికను స్పష్టంగా బయటపెట్టారు. దానిపై స్పందించిన ఎంపీ కేశినేని నాని త్వరలోనే బుద్ధ వెంకన్న మంచి పదవి వస్తుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం. అయితే ఏ నాయకుడైనా పదవి కావాలంటే కరెక్ట్ ప్రాసెస్‌లో ప్రయత్నాలు చేసుకుంటారు. బుద్దా వెంకన్న మాత్రం ఇలా రచ్చకెక్కి యాగీ చేస్తుండటంతో.. టీడీపీ పెద్దలు రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×