BigTV English

CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..ఘనస్వాగతం పలికిన అభిమానులు

CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..ఘనస్వాగతం పలికిన అభిమానులు

Telangana CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అభిమానులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14 వరకు దాదాపు 10రోజులు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానంగా అమెరికాలోని న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో పర్యటించనున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.


తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లారు. ఆయనతోపాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉన్నారు. పర్యటనలో భాగంగా 8 రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం.


Also Read: శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డ అమెరికా పర్యటన అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. ఈ నెల 14న రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించనున్నట్లు సమాచారం. క్యాబినేట్ లో 6 ఖాళీలు ఉండగా..మంత్రి వర్గంలోకి ప్రస్తుతం నలుగురిని తీసుకోనున్నారు. మిగతా రెండు బెర్తుల కోసం వివిధ సమీకరణాల ప్రకారం..భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే క్యాబినేట్ విస్తరణ జరిగిన వెంటనే పీసీసీ చీఫ్‌ను కూడా నియమిస్తారని సమాచారం.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×