AP local body elections result 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ట్రెండ్ వచ్చేసింది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడ చూసినా కూటమి జెండాలు రెపరెపలాడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు.. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. చివరకు పులివెందులలో అదే ఫలితాలు రిలీఫ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. బలమైన పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ పత్తా లేకుండా పోయింది. కౌంటింగ్ కేంద్రాల నుంచి నేతలు, ఏజెంట్లు వెళ్లిపోయారు.
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాల ట్రెండ్ మొదలైంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలైన నుంచి కూటమి పార్టీల హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూటమి పార్టీల జోరు కంటిన్యూ అవుతోంది. ఇచ్చాపురం మొదలు కుప్పం వరకు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. చాలామంది అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక కార్పొరేషన్ల విషయానికి వద్దాం. విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, గుంటూరు, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ అధిక్యం కొనసాగుతోంది. జనసేన పోటీ చేసిన ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లతోపాటు మిగతా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కూడా అదే విధంగా దూసుకుపోతోంది. మొత్తం 87 మున్సిపాలిటిలకు గాను 50 వాటిల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
అందులో టీడీపీ-39, జనసేన-7, బీజేపీ-3 చోట్ల జోరు కొనసాగిస్తున్నారు. వైసీపీ కేవలం ఒక్క మున్సిపాలిటీలో ఆధిక్యం కనబరుస్తోంది. ఫలితాలను గమనిస్తున్న వైసీపీ నేతలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో టీడీపీ చేసిన మాదిరిగానే.. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటే కాస్త హుందాగా ఉండేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫలితాలు వస్తున్నాయని చర్చించు కుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అధినేత పెద్దగా ఫోకస్ చేయలేదని అంటున్నారు.
ALSO READ: జగన్‌కు అస్సలు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, చివరకు కేసు కూడా
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి తాడేపల్లి కంటే బెంగుళూరులో ఎక్కువ రోజులు ఉన్నారని అంటున్నారు. నోటిఫికేషన్‌కు ముందు జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని కొంప ముంచాయని అంటున్నారు. ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇస్తే వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఉందని చెప్పడం, షర్టు మడత పెట్టామని, ఎవరు వస్తారో రండి చూద్దాం అని చెప్పడం వంటి వ్యాఖ్యలు పార్టీని బాగా డ్యామేజ్ చేశాయని అంటున్నారు.