BigTV English

Heavy Rain In Tirupati: విరుచుకుపడ్డ ఫెంగల్ తుఫాన్.. తిరుపతిలో అధిక వర్షపాతం నమోదు.. తిరుమలలో కూడా..

Heavy Rain In Tirupati: విరుచుకుపడ్డ ఫెంగల్ తుఫాన్.. తిరుపతిలో అధిక వర్షపాతం నమోదు.. తిరుమలలో కూడా..

Heavy Rain In Tirupati: ఏపీలోని తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం నుండి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం తుఫాన్ ఎఫెక్ట్ మరింత పెరగడంతో ఎక్కడ చూసినా, జలకళ సంతరించుకుంది. ప్రధానంగా కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో సైతం ఎడతెరిపి లేకుండా ఆదివారం వర్ష ప్రభావం కనిపించింది. దీనితో తిరుమల మాడవీధుల్లో నీటి ప్రవాహం ఏరులా ప్రవహించింది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.


తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా రెండవ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడడంతో, సమాచారం అందుకున్న టీటీడీ వెంటనే జేసీబీలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకుంది. టీటీడీ సకాలంలో స్పందించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం ధాటికి తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటివనరులు కాగా, శనివారం నుండి కురుస్తున్న వర్షం ధాటికి వీటిలో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకుంది. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు నీటితో నిండిన జలాశయాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


Also Read: Tirumala Dec 2024 Festivals: డిసెంబర్ నెల తిరుమల వెళ్తున్నారా.. ఈ తేదీలు మరచిపోవద్దు

అలాగే తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అధిక వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోనే 5 అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు గుర్తించగా, వాటిలో అన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాకు చెందినవి కావడం విశేషం. కేఎం అగ్రహారంలో 187 మి.మీ, కేకేఆర్కే పురం 162 మి.మీ, రాచపాలెం 152 మి.మీ, మన్నార్ పొలూరు 149 మి.మీ, భీములవారిపాలెం 137 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మొత్తం మీద ఫెంగల్ తుఫాను ప్రభావం తిరుపతి జిల్లాపై అధికంగా ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావాన్ని సమీక్షిస్తోంది.

Related News

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

Big Stories

×