BigTV English

Bigg Boss 8 Telugu Promo: కంటెస్టెంట్స్ ఫోటోలతో సినిమా పోస్టర్లు.. ఇది కదా ఎంటర్‌టైన్మెంట్ అంటే!

Bigg Boss 8 Telugu Promo: కంటెస్టెంట్స్ ఫోటోలతో సినిమా పోస్టర్లు.. ఇది కదా ఎంటర్‌టైన్మెంట్ అంటే!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో సండే ఫన్‌డే మరింత మజా పెరగనుంది. కంటెస్టెంట్స్‌తో నాగార్జున సందడి ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేయనుంది. ఇప్పటివరకు సండే ఫన్‌డే అంటే ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ఆటలు ఆడించడం, పాటలు గెస్ చేయమనడం.. ఇలాంటివి ఉండేవి. కానీ ఈసారి అలా కాదని ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ఆటకు సంబంధించిన ప్రోమో చూస్తుంటే ఆడిన కంటెస్టెంట్స్ ఎంత ఎంజాయ్ చేశారో.. ఆడియన్స్‌కు కూడా అంతే ఎంటర్‌టైన్మెంట్ అందనుందని అర్థమవుతోంది. ఇక చివరికి కంటెస్టెంట్స్ ఫోటోలతో సినిమా పోస్టర్లు చేసి వారితో పాటు అందరినీ నవ్వించారు.


కళ్లకు గంతలు

‘‘బ్లైండ్ ఫోల్డ్ మ్యూజికల్ చైర్స్.. కంటెస్టెంట్స్ వెతక్కుంటూ వెళ్లి ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోవాలి’’ అంటూ నాగార్జున గేమ్ గురించి చెప్పడంతో ఈ బిగ్ బాస్ ప్రోమో ప్రారంభమవుతుంది. ఈ ఫన్నీ గేమ్‌కు నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. కంటెస్టెంట్స్ అంతా కళ్లకు గంతలు కట్టుకొని ఉంటారు కాబట్టి ఎవరైనా గోడకు తగలడానికి వెళ్లినా, స్విమ్మింగ్ పూల్ వైపుకు వెళ్లినా నిఖిల్ వారిని ఆపాల్సి ఉంటుంది. అలా ఆట మొదలయ్యింది. కంటెస్టెంట్స్ అంతా పాటకు డ్యాన్స్ చేస్తూ అది అయిపోగానే బీన్ బ్యాగ్స్‌ను వెతుక్కుంటూ వెళ్లి కూర్చోవాలి. నబీల్ నేరుగా వెళ్లి బీన్ బ్యాగ్ మీద కూర్చోగానే తల పైకి లేపి చూసుకుంటూ నడుస్తున్నాడని నిఖిల్ అన్నాడు. దీంతో తనను ఔట్ చేశారు నాగార్జున.


Also Read: గెస్ ది సాంగ్.. సండే ని మరింత ఫన్ గా మార్చిన కంటెస్టెంట్స్..!

సంచాలకుడిగా అవినాష్

అవినాష్ సంచాలకుడిగా ఉన్నప్పుడు బీన్ బ్యాగ్‌పై కూర్చొని రోహిణిపై కామెంట్స్ చేశాడు. దీంతో రోహిణి వెళ్లి అవినాష్‌ను తోసేసి తనే బీన్ బ్యాగ్‌పై కూర్చుంది. ఆ తర్వాత రౌండ్‌కు నబీల్, అవినాష్, నిఖిల్.. ముగ్గురు సంచాలకులుగా వ్యవహరించారు. బీన్ బ్యాగ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి విష్ణుప్రియా తంతూ ముందుకు వెళ్లడంతో ఏం తంతున్నావంటూ తనపై జోకులు వేశాడు అవినాష్. గౌతమ్ మెయిన్ డోర్ వైపుకు వెళ్తుంటే ఇంటికి వెళ్లి వస్తావా అంటూ కామెడీ చేశాడు. ప్రేరణ తనవైపుకు వస్తుంటే ఏం తప్పు చేశావు కాళ్లు పట్టుకుంటున్నావని అన్నాడు. అలా ఫైనల్‌గా ఒక బీన్ బ్యాగ్‌ను దక్కించుకొని కూర్చుంది ప్రేరణ. చివరిలో మిగిలిపోయిన రోహిణి వెళ్లి ప్రేరణపై పడింది.

నిఖిల్ ఫ్యామిలీ స్టార్

ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఫోటోలను, మూవీ పోస్టర్లతో ఎడిట్ చేసినవి వారికి చూపించారు నాగార్జున. ముందుగా నబీల్ ఫోటోను ‘డబుల్ ఇస్మార్ట్’ పోస్టర్‌తో ఎడిట్ చేశారు. ఈ పోస్టర్ కరెక్టా అని కంటెస్టెంట్స్‌ను అడిగారు నాగార్జున. 100 శాతం కరెక్ట్ అని రోహిణి స్టేట్‌మెంట్ ఇచ్చింది. విష్ణుప్రియా, పృథ్వి ఫోటోలను ‘నిన్ను కోరి’ మూవీ పోస్టర్‌తో ఎడిట్ చేశారు. గౌతమ్ ఫోటోను ‘ఏక్ నిరంజన్’ మూవీ పోస్టర్‌తో ఎడిట్ చేసింది చూపించగానే తను పడిపడి నవ్వాడు. రోహిణిని ‘అరుంధతి’గా, ప్రేరణను ‘అందాల రాక్షసి’గా చూపించారు. చివరికి నిఖిల్‌ను ‘ది ఫ్యామిలీ స్టార్’, అవినాష్‌ను ‘సుడిగాడు’తో మ్యాచ్ చేశారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×