Thani Oruvan 2 – AGS : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒకటి. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల వచ్చాయి. అలానే భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఈ బ్యానర్ నిర్మించింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ఈ బ్యానర్ దూసుకుపోతుంది. విజయ నటించిన గోట్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో నిర్మితమైంది. అట్లీ దర్శకత్వం వహించిన విజిల్ సినిమా కూడా ఈ బ్యానర్ లో వచ్చింది. రీసెంట్ గా తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా సంచలనం సృష్టించిన సినిమా లవ్ టుడే. ఈ సినిమాను ఏజీస్ బ్యానర్ నిర్మించింది. ఇక రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్రాగన్ అనే సినిమాను తెరకెక్కించింది.
డ్రాగన్ సినిమాకు అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ తో పాటు, దర్శకుడు మిస్కిన్, కే ఎస్ రవికుమార్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి ఇదివరకే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ఈవెంట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు నిర్మాతలు. ఈ తరుణంలో ఈ బ్యానర్ లో నెక్స్ట్ తెరకెక్కకపోయే సినిమాలను రివిల్ చేశారు నిర్మాత అర్చన. ఈ బ్యానర్ లో శింబు ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. అలానే శివ కార్తికేయన్ కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మళ్లీ ప్రదీప్ రంగనాథన్ తో ఒక సినిమా ఉండబోతుంది. వీటితోపాటు ఈ బ్యానర్ లో ఇంకో రెండు చిన్న సినిమాలు నిర్మితమవుతున్నట్లు అర్చన ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read : Marco Scenes: వైరల్ గా మారిన మార్కో డిలీటెడ్ సీన్.. ఇంత వయలెన్స్ ఏంటి గురూ..
అయితే ఈ బ్యానర్ లో ఎప్పటినుంచో తని వరువన్ 2 సినిమా వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ దాని గురించి అర్చన అసలు ప్రస్తావన తీసుకురాలేదు. దీనితో చాలామందికి తని వరువన్ 2 సినిమా ఉంటుందా లేదా అని ఆలోచనలు మొదలయ్యాయి. తని వరువన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగులో రీమేక్ చేసి రాంచరణ్ కు అద్భుతమైన ఘనవిజయాన్ని అందించాడు. చరణ్ కి కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వస్తుంది అని ఊహిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read : Hari Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా..? ఫ్యాన్స్ ఇక ఆశలు వదులుకోవడమేనా..?