Intinti Ramayanam Today Episode February 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ భానుమతిని ఫ్లవర్ బొకే షాప్ దగ్గర తీసుకెళ్తాడు. పూలని అమ్మమని చెప్తాడు. కమల్ చెప్పినట్టు భానుమతి పూలు నమ్ముతూ ఉంటే పల్లవి వచ్చి భానుమతిని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే కమ్మలు వచ్చి ఈ ముసలోని తీసుకొచ్చాను ఎక్కడ వదినా కనిపించలేదంటే అమ్మమ్మని తీసుకొచ్చింది నువ్వా అంటే అవును వదిన నేనే తీసుకొచ్చాను ఏమైంది ఇప్పుడు ? మీ షాప్ లో పని చేయించాలని తీసుకొచ్చాను వదిన అని అంటాడు. ఆవిడ ఎలాంటిదైనా పర్లేదు కమల్ వయసులో పెద్ద ఆవిడ ఇంటికి పెద్ద దిక్కు అవిని మర్యాదగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అని కమల్ ని హెచ్చరిస్తుంది. కానీ ఆ ముసలిది నేను ఇంట్లోంచి పంపించాలని పెద్ద స్కెచ్ వేసింది అంటే పర్లేదు నేను బాగానే ఉన్నాను కదా అని అవని అంటుంది. అవనికి సాయం చెయ్యాలని అనుకుంటాడు. కానీ అవని మాత్రం నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీయ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పల్లవి శ్రీకరు అవనీ వెళ్లడం చూసి శ్రియ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్తుంది. మన భర్తలు మనకన్నా ఎక్కువగా వాళ్ళ వదినని ప్రేమిస్తారు వాళ్ళ వదిన అంటే దేవత అని చాలా విషయాల్ని శ్రీయను తన ప్లాన్ వైపు తిప్పుకునేలాగా చెప్తుంది. మనం ఏం చేసినా తప్పే వాళ్ళ వదిన మాత్రమే దేవత ఆస్తి రాయించుకోవాలని చూసిన కూడా వదినే దేవత అని చాలా విధాలుగా చెప్పి శ్రీయను ట్రాప్ చేస్తుంది. అభినయక్క ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమె కోసం మన భర్తలు ఏవేవో చేస్తారు ఒక్క మాట కూడా అననివ్వరు ఆమె చేసింది తప్పేమీ కాదు అని పల్లవి శ్రియకు నూరిపోస్తుంది.
ఇక శ్రీయ, శ్రీకర్ వస్తాడా రాదని వెయిట్ చేస్తూ ఉంటుంది.. పల్లవి చెప్పిన మాటలన్నీ నిజమే నేను నమ్మి ఇక శ్రీకర్ రాడని రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అక్షయ్ అవినీతి సాయం చేయాలని దయాకర్ వాళ్ళింటికి సరుకులను పంపిస్తాడు. స్వరాజ్యం దయాకర్ ఏంటి బాబు ఇవన్నీ అంటే నా భార్యకు మీరు షెల్టర్ ఇచ్చారు మీకోసమే ఆ మాత్రం కూడా చేయలేనా అని సరుకులను అతని ఇంట్లో పెట్టమని చెప్తాడు. కానీ అవని మాత్రం ఇంట్లో పెడుతున్న సరుకుల్ని బయటకు పంపించేస్తుంది. నేను ఎవరి దయ దక్షిణ్యాల మీద బతకకూడదు అనుకుంటున్నాను. నేను జాబ్ చేస్తున్నాను నాకు కాల మీద నేను నిలబడగలను మీకు భారం అనుకుంటే చెప్పండి పిన్ని నేను ఎక్కడికైనా బయటికి వెళ్లిపోతానని అవని అంటుంది. మాకు భారం ఎందుకు అనుకుంటాం అమ్మ.. మాకు పిల్లలు లేని లోటుని నీలో తీర్చుకుంటున్నామని అంటారు.
ఆ మాటలు విన్న అక్షయ్ సామాన్లను వెనక్కి పంపిస్తాడు. పల్లవి, శ్రీయ నా మాట వినిందో లేదో అని తెలుసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శ్రియా కోపంగా ఇంటికి వస్తుంది నువ్వు చెప్పింది నిజమే శ్రీకర్ వదినకి దాసోహం అయిపోయాడు వీళ్ళని ఎలా మార్చుకోవాలి నాకు తెలియట్లేదు నాకు చాలా కోపం వస్తుంది అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి శ్రియ బర్తడే వేడుకల్ని ఇంట్లో చేయాలని ప్లాన్ చేస్తుంది. శ్రీయకు అందరూ శ్రియకి విష్ చేస్తారు..
శ్రీకర్ ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్తే బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా చేసేవాళ్లం కదా అని కమల్, అక్షయ్ అంటారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఒక అరగంటలోనే మనం హాల్లో డెకరేట్ చేసి శ్రీయ బర్త్ డే వేడుకల్ని గ్రాండ్గా చేద్దామని అంటారు.. అప్పుడే శ్రీకర్ఇంటికి వస్తాడు. శ్రియకు బర్త్డే గిఫ్ట్ తీస్తే దాన్ని విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి శ్రీకర్ అన్ని నిజాలను బయట పెట్టబోతున్నాడు. పల్లవి గురించి ఇంట్లో వాళ్లకి నిజం చెప్పబోతాడు శ్రీకర్. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అటు ఆరాధ్య అమ్మతో మాట్లాడాలని అక్షయ ని అడుగుతుంది. అవని గురించి ఆలోచిస్తూ ఆరాధ్యకు ఫోన్ చేసి ఇస్తాడు. ఆరాధ్య మాట్లాడుతుంటే అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..