Tirumala Fire Accident: తిరుమలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాసేపటి క్రితమే.. తిరుమల శ్రీవారి పాదాల వద్ద పార్కింగ్ స్థలానికి సమీపాన అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక దుకాణదారులు, భక్తుల వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. దాదాపు వంద మీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు అటవీ అధికారులు తెలిపారు. భారీ మంటల కారణంగా ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.
ALSO READ: Crime News: స్కూల్‌లో కాల్పులు, 10 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి
శ్రీవారి పాదాల వద్ద శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. మంటలు వ్యాపించడంపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కూడా తిరుమల శేషాచల అడవుల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తుంబురు తీర్థం అటవీ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ: Meghalaya Honeymoon Murder: శోభనం రోజు రాత్రి ఏం జరిగింది? ‘హనీమూన్’ ఘటనలో ఊహించని ట్విస్ట్