BigTV English
Advertisement

Crime News: స్కూల్‌లో కాల్పులు, 10 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Crime News: స్కూల్‌లో కాల్పులు, 10 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Crime News: ఆస్ట్రియా దేశంలో దారుణ విషాదం చోటుచేసుకుంది.  దేశంలో రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో బోర్గ్ డ్రెయిర్‌షుట్జెన్‌ గాస్సే పాఠశాలలో ఓ స్టూడెంట్ జరిపిన కాల్పుల్లో పలువురు మృతిచెందారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ నిందితుడు పాఠశాల టాయిలెట్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే.. పాఠశాల భవనం లోపలి నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.


ALSO READ: Meghalaya Honeymoon Murder: శోభనం రోజు రాత్రి ఏం జరిగింది? ‘హనీమూన్’ ఘటనలో ఊహించని ట్విస్ట్

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. పాఠశాల విద్యార్థి ఈ రోజు ఉదయం స్కూల్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం పది మంది మృతిచెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మృతిచెందిన వారిలో ఎనిమిది విద్యార్థులు, ఓ యువకుడు, టీచర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.


కాల్పుల నుంచి అనేక మంది టీచర్లు, విద్యార్తులు, వారి తల్లిదండ్రులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. 2015 జూన్ 20న కూడా గ్రాజ్‌లో కాల్పులు జరిగాయి. అప్పుడు ముగ్గురు మరణించారు. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇదే సమయంలోనే మళ్లీ కాల్పులు జరగడం పలు అనుమానాలకు తెర లేపింది. అసలు కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు జరిపారు? అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: AP : అమరావతిలో లక్ష మంది వేశ్యలా? అసలు నిజాలు ఇవే..

Related News

Bhimavaram Crime: తల్లి-తమ్ముడిపై కత్తితో దాడి.. ఆ తర్వాత నరికి, భీమవరంలో దారుణం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Big Stories

×