విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని కంకిపాడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి తెల్ల జుట్టుతో తెల్ల షర్ట్ వేసుకుని, విభూది పెట్టుకుని వంశీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు, గన్నవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ను చూసేందుకు ముందుకొచ్చారు. వారిలో కొందరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎలా అయిపోయావ్ అన్నా..!
అన్నా ఒకసారి మొహం చూసుకో అన్నా ఎలా అయిపోయావో అంటో ఓ అభిమాని వంశీని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. మరో అభిమాని ఆయన మొహాన్ని ఆప్యాయంగా నిమురుతూ కంటతడి పెట్టుకున్నంత పనిచేశారు. ఆ వీడియోలో వంశీ పూర్తిగా తెల్లజుట్టుతో కనపడ్డారు. వంశీ వయసులో ఉన్న ఎవరికైనా తెల్ల వెంట్రుకలు కామన్. అయితే ఇన్నాళ్లూ రంగు వేసి వంశీ కవర్ చేశారు. ఇప్పుడు జైలులో రంగులు వేసుకునే అవకాశం లేకపోవడంతో ఆయన తెల్లజుట్టు బయటపడింది. వాస్తవానికి వంశీ జుట్టు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ వయసువారికి అది సహజం. కానీ మధ్యలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వల్లే వంశీపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
వల్లభనేని వంశీని గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
కస్టడీ టైంలో పోలీసులు ఇబ్బందులు పెట్టారా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు లేదు అని వంశీ సమాధానం
భోజనం పెట్టారా అని అడిగిన న్యాయమూర్తి… పెట్టారని తెలిపిన వంశీ
తమ భార్యతో 10 నిమిషాలు మాట్లాడేందుకు వంశీకి అనుమతి ఇచ్చిన… https://t.co/sPXdcZqfsw
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2025
ఇంతకీ జగన్ ఏమన్నారు..?
గతంలో వంశీ అరెస్ట్ తర్వాత విజయవాడ జైలులో ఆయన్ను కలిసేందుకు వచ్చారు జగన్. ఆ సమయంలో జైలు బయట ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వంశీ అందగాడు కాబట్టే ఆయన్ను చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు జగన్. చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామరస్ గా ఉంటారని, తన సామాజిక వర్గంలో తనకంటే బాగుండేవారన్నా, తనకంటే పైకి ఎదిగేవారన్నా చంద్రబాబుకి ఇష్టం లేదని అన్నారు జగన్. అందుకే వారిని టార్గెట్ చేస్తుంటారని వింత వ్యాఖ్యలు చేశారు. దేవినేని అవినాష్ కూడా అందగాడేనని, అందుకే ఆయన్ను కూడా టార్గెట్ చేస్తుంటారని చెప్పుకొచ్చారు. అప్పట్లో జగన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆ అందం ఏమైపోయింది..?
జగన్ వ్యాఖ్యల తర్వాత కొన్నిరోజులకు వంశీ పోలీస్ కస్టడీకోసం బయటకు రావాల్సి వచ్చింది. అప్పటికి ఆయన అందం బయటపడిపోయింది. జైలులో ఉండటం వల్ల తలకు రంగు వేసుకోలేదు. తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో వంశీ ఏజ్ స్పష్టంగా కనపడుతోంది. దీంతో అందగాడా..! అందగాడా..! అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి. ఈ అందగాడ్ని చంద్రబాబు టార్గెట్ చేశారా అంటూ ప్రశ్నించారు నెటిజన్లు.
తీరా ఇప్పుడు మరోసారి వంశీ బయటకు రావడంతో ఈ అందగాడు టాపిక్ మళ్లీ హైలైట్ అయింది. అందులోనూ ఆయన అభిమానులు వంశీపై ఎక్కడ లేని జాలి చూపించారు. అన్నా ఇలా అయిపోయావేంటి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వంశీ మాత్రం ఎక్కడా తొణకలేదు. తనదైన శైలిలో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. మొత్తానికి సోషల్ మీడియాలో వంశీ ఎదుర్కొంటున్న ట్రోల్స్ అన్నిటికీ పరోక్షంగా జగనే కారణం అని అంటున్నారు నెటిజన్లు.