BigTV English

OTT Movie : ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 థ్రిల్లర్ మూవీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 థ్రిల్లర్ మూవీస్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : మలయాళం సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలు, థియేటర్లలో విజయాలు నమోదుచేసుకుని, ఓటీటీలో కూడా అదరగొడుతున్నాయి. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటి’ నుంచి ‘రేఖ చిత్రం’ వరకూ ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు కావడం గమనించదగిన విషయం. ఈ సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి వివరాలు తెలుసుకుందాం.


‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on Duty)

2025 లో విడుదలైన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్ & ఈఫోర్‌ సంస్థ బ్యానర్‌పై మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చవారా నిర్మించారు. ఈ సినిమాకు జితు అష్రఫ్‌ దర్శకత్వం వహించారు. ఒక చైన్ దొంగతన కేసును ఛేదించే క్రమంలో, ఒక పెద్ద నెట్వర్క్ నే పోలీసులు కనిపెడతారు. వాళ్ళు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


‘సూక్ష్మదర్శిని’ (Sookshamadarshini)

2024 లో విడుదలైన ఈ మలయాళ భాషా బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీకి MC జితిన్ దర్శకత్వం వహించారు. యాపీ అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ,AVA ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ , అఖిల భార్గవన్ , మెరిన్ ఫిలిప్,పూజా మోహన్‌రాజ్ నటించారు. ఈ మూవీ ప్రియదర్శిని, ఆమె స్నేహితుల చుట్టూతిరుగుతుంది.  తన పొరుగు ఇంటికి వచ్చిన మాన్యుయేల్ గురించి తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది.  డిస్ని +హాట్ స్టార్ (Disney + Hot Star) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

‘కింగ్ స్టన్’ (Kingston)

2025లో విడుదలైన ఈ సినిమా జీ స్టూడియోస్ & ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జి. వి. ప్రకాష్ కుమార్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మించారు.  ఈ సినిమాకు కమల్‌ ప్రకాశ్ దర్శకత్వం వహించాడు. జి. వి. ప్రకాష్ కుమార్, దివ్యభారతి, చేతన్, అళగం పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో సముద్రం లోకి వెళ్ళే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఒక శాపం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. దానిని ఛేదించే క్రమంలో మూవీ స్టోరీ ముందుకు వెళ్తుంది. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో జీ 5 (Zee 5)లోకి  రాబోతోంది.

‘రేఖచిత్రం’ (Rekhachitram).

2025 లో విడుదలైన ఈ మలయాళం మిస్టరీ క్రైమ్ మూవీ కి జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించారు. ఇందులో మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ ఇంద్రన్స్‌లతో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ నటించారు. వివేక్ ఆత్మహత్య కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది.  రాజేంద్రన్ ఈ కేసులోని నిజాలను వెలుగులోకి తెస్తాడు. సినిమా మొత్తం మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. సోనీలివ్ (Sonyliv) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

చాప్రా మర్డర్ కేస్ (Chapra Murder Case)

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అంచక్కల్లకొక్కన్ సినిమాను,  తెలుగులో చాప్రా మర్డర్ కేస్ అనే పేరుతో ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు. అలరించే ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌‌తో సాగే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి ఉల్లాస్ చెంబన్ దర్శకత్వం వహించారు.  నటుడు చెంబన్ వినోద్ జోస్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ఆహా (aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×