Pawan Kalyan..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన తన సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాదు బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించి, దేశవ్యాప్తంగా అత్యధికమంది ఫాన్స్ కలిగి ఉన్న హీరోగా పేరు సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే సామాజిక సేవ చేయడమే బాధ్యతగా ముందుకు వచ్చిన ఈయన ఒకవైపు తన అన్న స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నారు. కానీ ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. దాంతో పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లోకి విలీనం చేసి కొద్దిరోజులు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
ప్రజల శ్రేయస్సే ముఖ్యం..
ఇక తర్వాత జనసేన అనే పార్టీని సొంతంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి 2024 ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 21 స్థానాల్లో పోటీ చేయగా.. 21 స్థానాలు కైవసం చేసుకుని 100% స్ట్రైక్ తో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక నాటినుండి ప్రజల శ్రేయస్సుకు పాటుపడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యం అంటూ ముందడుగు వేస్తున్న ఈయన.. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నోట్ వదిలారు.
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్..
ఇక అందులో పవన్ కళ్యాణ్..” తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. పండుగలు.. ఆచార వ్యవహారాలు.. సంస్కృతి సంప్రదాయాలు.. కళలు.. జాతిని సజీవంగా నిలుపుతాయి. మన ముంగిళ్ళకు వచ్చిన ఉగాది తెలుగు వారి వారసత్వపు పండుగ.. విశ్వాసం అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం.. మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాము. గత ప్రభుత్వం పాలన కష్టాల మయం అయిపోగా.. ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలనను ఆంధ్రప్రదేశ్లో ప్రజల ముంగిటకు వచ్చింది. చైత్రమాసపు శోభతో వసంతాన్ని మోసుకు వచ్చిన ఈ విశ్వాస నామ ఉగాది తెలుగు లోగిళ్లను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను “అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.
ALSO READ:Manchu Vishnu: వాయిదా పడ్డ కన్నప్ప.. సుదీర్ఘ పోస్ట్ వదిలిన మంచు విష్ణు..!
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఇక పవన్ కళ్యాణ్ మరొకవైపు సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ . ఈ సినిమాలన్నీ కూడా త్వరగా విడుదల చేసి ఇక రాజకీయ రంగానికే పరిమితం కావాలని పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం మరి ఏ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉండిపోతారేమో చూడాలి.