BigTV English

Uttarandhra News: ఉత్తరాంధ్రకు వైభోగం.. ఫారెన్ యూనివర్సిటీ రాక

Uttarandhra News: ఉత్తరాంధ్రకు వైభోగం.. ఫారెన్ యూనివర్సిటీ రాక

Uttarandhra News: ఏపీ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ఫారెన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన వారంలో ఉత్తరాంధ్రలో ఫారెన్ యూనివర్సిటీ రాకకు సుగమం అయ్యింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ ప్రతినిధులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు మంత్రి లోకేష్.


ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీల దృష్టి విశాఖ వైపు పడింది. భారీగా డేటా సెంటర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌-జపాన్‌కు చెందిన నిప్పన్‌ జాయింట్‌ వెంచర్‌ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఐఐఎం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఫారెన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రకు రాబోతోంది.

ఉత్తరాంధ్రకు ఫారెన్ యూనివర్సిటీ


ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ-ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ-SEUతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లిలో తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఈయు-ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఎంఓయుపై ఒప్పంద సంతకాలు జరిగాయి.

ఈ డీల్ ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా 500 మందికి ఉపాధి దక్కనుంది.

ALSO READ: మాజీ మంత్రి రోజాకు అండగా ఓ కీలక అధికారి

హిస్టరీలోకి వెళ్తే..

జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా ఒకటి. 2002లో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ-SEU అవతరించింది. అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 1,100 మందికి నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బంది ఈ యూనివర్సిటీ సొంతం. సుమారు 52,500 మంది పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు.

SEU ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నాలుగు ఇంటర్నేషనల్ అక్రిడిటేడెట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ తోపాటు పలు అంతర్జాతీయ కంపెనీల కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్ తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లను కూడా నిర్వహిస్తుంది జార్జియా యూనివర్సిటీ.

ఏపీ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పించనుంది. ట్రెండ్ కు అనుగుణంగా సిలబస్‌ను ఆధునీకరించడం, ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలను లభించనున్నాయి.

ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ

ఏపీలో ఉన్నత విద్యకు పెద్ద ముందడుగు పడిందన్నారు మంత్రి లోకేష్. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపారు. ఈ భాగస్వామ్యం ప్రపంచ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుందని భావించారు. ఏపీని ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలనే సంకల్పం గతం కంటే ఇప్పుడు బలంగా ఉందన్నారు.

విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తుందని వెల్లడించారు. ఎస్ఈయుతో ఒప్పందం ఏపీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడానికి ఓ అడుగు ముందుకు పడిందన్నారు. దీనిద్వారా రాష్ట్ర విద్యా రంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు సహాయపడుతుందన్నారు. విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయన్నారు.

విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం ఒక నిదర్శనమని వెల్లడించారు.  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్, ఆరోగ్య హెల్త్ కేర్ లలో నైపుణ్యాలను అందించనుంది. అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జి షేరింగ్ ను సులభతరం కానుంది.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×