AP Politics: మొన్నటి వరకు వైసీపీలో కొనసాగారు ఆ నేత. ఇటీవల పార్టీకి రాజీనామా అంటూ బయటకు వచ్చారు. త్వరలో టీడీపీలో చేరేందుకు ఆ నేత అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తనకు పార్టీ అధినేత హామీ ఇచ్చారని, తన కోరిక నెరవేరబోతోందని కూడ ఆ నేత చెప్పేస్తున్నారు. అయితే తాజాగా జగన్ చేసిన 2.O కామెంట్స్ పై ఆ నేత భగ్గుమన్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయ ముఖచిత్రం లో సుపరిచితులే. ఇటీవల వైసీపీకి రాం రాం చెప్పిన మాణిక్య వరప్రసాద్ ఛాన్స్ దొరికినప్పుడల్లా.. జగన్ పై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. గురువారం మీడియా సమావేశంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు ఆయన. డొక్కా మాట్లాడుతూ .. ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముగింపు పలకడం తనకు సంతోషంగా ఉందన్నారు.
వర్గీకరణ అనుకూలంగా సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన డొక్కా మాణిక్య వరప్రసాద్, వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన పంబా, నేతగాని కుటుంబాలను మొదటి వరుసలో ఉంచాలని సూచించారు. అలాగే వర్గీకరణ విషయంలో మాదిగలు 75 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశారని, అందుకు ఎన్నో కష్టాలను కూడా అనుభవించారన్నారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేసిన పోరాటాల ఫలితాలను, త్వరలోనే మాదిగలు అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేకాకుండా మంద కృష్ణ మాదిగను.. దళితుల అంబేద్కర్ గా ఆయన అభివర్ణించారు.
ఇక వైసీపీ, మాజీ సీఎం జగన్ లక్ష్యంగా మాజీ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీగా తెలిపిన మాణిక్య వరప్రసాద్, దళితులను సర్వనాశనం చేసి పథకాలను ఇవ్వకుండా వారి జీవితాలలో హాలీ విస్తరి మిగిల్చిన ఘనుడు జగన్ అంటూ విమర్శించారు. లండన్ నుండి వచ్చిన తర్వాత జగన్ కు మతిభ్రమించిందని, 2.O అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడటం చూస్తుంటే పిచ్చి తగ్గినట్లు అనిపించడం లేదన్నారు. తక్షణమే జగన్ అత్యవసరంగా వైద్యశాలలో చూపించుకోవాలని డొక్కా హితవు పలికారు.
Also Read: YS Jagan on Sai Reddy: సాయిరెడ్డి రాజీనామాపై జగన్ కామెంట్స్.. క్యారెక్టర్ అంటూ..
వైసీపీ హయాంలో లక్ష కోట్లు మద్యం కుంభకోణంపై తక్షణమే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, వైయస్ జగన్ తనకు ఇచ్చిన షాక్ నుండి నేటికీ తేరుకోలేదన్నారు. రాజకీయంగా తనను మోసం చేశారని, అలాగే 74 మంది రాజకీయ నేతల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఘాటుగా విమర్శించారు. రాబోయే రోజులలో గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని కోరికను టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించానని, అందుకు సానుకూలంగా స్పందన లభించిందన్నారు.