BigTV English
Advertisement

Sourav Ganguly: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు

Sourav Ganguly: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు

Ganguly Post on Team India New Coach Various Reasponce Net Users: టీమ్ ఇండియా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా విభజిస్తే సౌరభ్ గంగూలికి ముందు తర్వాత అని చెబుతారు. ఎందుకంటే ఒకప్పుడు టీమ్ ఇండియాలో అంటే సునీల్ గవాస్కర్, అజారుద్దీన్ లాంటి వారు ఉన్న సమయంలో మ్యాచ్ గెలవడం కంటే వ్యక్తిగత రికార్డులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.


తను సెంచరీ చేశాడా? లేదా? తను మ్యాచ్ లో వికెట్లు తీసుకున్నాడా? లేదా? అంతే, మ్యాచ్ ఎలా పోయినా పర్వాలేదు. అంటే ఒక పోరాట పటిమ ఉండేది కాదు.. గెలవాలనే తపన ఉండేది కాదు.. దేశం కోసం ఆడుతున్నామనే స్ప్రహ ఉండేది కాదు.. వెళ్లామా? ఆడామా? వచ్చామా? లేదా? అంతే ఇలాగే ఉండేది.

కానీ గంగూలీ జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చూశాడు. తర్వాత కెప్టెన్ అయ్యాడు. అంతే జట్టులో ఒక కసిని నింపాడు. దేశం కోసం ఆడాలనే తపన రగలించాడు. వ్యక్తిగత రికార్డులు కాదు.. దేశ ప్రతిష్ట ముఖ్యమన్నాడు. మన జట్టు గెలిస్తే భారతదేశం గెలిచినట్టు అని చెప్పాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత, నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత.. చొక్కా విప్పి తామెంత కసిగా ఉన్నామో ప్రపంచానికి చాటి చెప్పిన మొనగాడు సౌరభ్ గంగూలి.


టీమ్ ఇండియాలోకి రికమండేషన్లు కాదు, ఆడేవాళ్లు కావాలి, యువతరం కావాలని భావించి అలా ఎంతోమందికి అవకాశాలిచ్చాడు. అలా గంగూలీ కెప్టెన్సీలో వచ్చినవాడే మహేంద్ర సింగ్ ధోనీ.. ఇదంతా ఎందుకంటే ఒక కోచ్ కారణంగా సౌరభ్ గంగూలీ లాంటి వీరోచిత క్రికెటరు.. క్రికెట్ కే దూరమైపోయాడు.

ఆ కోచ్ ఎవరో కాదు.. విదేశీ కోచ్ గ్రెగ్ చాపెల్.. వీరేంద్ర సెహ్వాగ్ ని కొట్టి.. అవమానించిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎంతో మౌనంగా, ఎంతో సహనంతో ఉండే సచిన్ టెండూల్కర్ లాంటి లెజండరీ క్రికెటర్ బహిరంగంగా.. ఆ కోచ్ వ్యవహార శైలిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Also Read: టీ20 టోర్నీకి ముందు, ఆసీస్‌ను కంగారెత్తించిన విండీస్ ఆటగాళ్లు

ఇదంతా ఎందుకంటే.. టీమ్ ఇండియాకి కొత్త కోచ్ ఎంపిక చేయడంపై కొన్ని పదునైన మాటలు అనడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఒక కోచ్ కారణంగా తన కెరీర్ నాశనమైంది. ఒక కోచ్ కారణంగా సెహ్వాగ్ దారుణంగా అవమానం పాలయ్యాడు. అందుకే గంగూలీ ఏమంటున్నాడంటే ఒక కోచ్ ని ఎంపికచేసేటప్పుడు అర్హతలు చూడాలని అన్నాడు.

ఎవరు పడితే వారు కోచ్ లు కాలేరని అన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, ఎంతోమంది  యువ ఆటగాళ్ల భవిష్యత్తు, అక్కడ ముడిపడి ఉందని అన్నాడు. అయితే ఇంతవరకు కోచ్ ఎవరన్నది బీసీసీఐ ప్రకటించ లేదు. కానీ గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో సౌరభ్ గంగూలీ అన్నమాటలు నెట్టింట మంట పుట్టించాయి. చాలామంది గంగూలీని పట్టుకుని.. మీరు గంభీర్ ని ఉద్దేశించే అన్నారు కదా.. అని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. మొత్తానికి వ్యవహారం రచ్చరచ్చగా మారడంపై బీసీసీఐ పునరాలోచనలో పడిన పడుతుందని మరికొందరు అంటున్నారు.

Tags

Related News

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

Big Stories

×