BigTV English

Jagan: జగన్‌కు సంకేతాలు.. బొత్స ఓటమి ఖాయం! జీవీఎంసీ ఎన్నికల్లో ?

Jagan: జగన్‌కు సంకేతాలు.. బొత్స ఓటమి ఖాయం! జీవీఎంసీ ఎన్నికల్లో ?

YS Jagan latest news(Andhra politics news): వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి మారలేదా? ఎన్నికల్లో ఓడిపోయినా మనసు కనీసం మారలేదా? తాను చెప్పిందే జరగాలని భావిస్తున్నారా? జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం? నేతలే పార్టీని ఓడించారా? దీని ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికపై పడుతుందా? ఇవే ప్రశ్నలు వైసీపీ అభిమా నులను వెంటాడుతున్నాయి.


వైసీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే లుకలుకలు బయటపడుతున్నాయి. దీనికి ఎమ్మెల్సీ ఎన్నిక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ కి ఊహించని షాక్ తగిలింది. తిరుగులేని ఆధిక్యంతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వైసీపీ, ఇప్పుడు జరిగిన స్థాయి సంఘం ఎన్నికలు దేనికి సంకేతం. వైసీపీని ఆ పార్టీ నేతలు, కార్పొరేటర్లు ఓడించారని అంటున్నారు. రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక వైసీపీలో ముసలం పుట్టింది. స్థానిక నేతలను వదిలి పక్క జిల్లాకు చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం అధినేతకు చెప్పాలని బుధవారం సమావేశంలో నేతలు ప్రయత్నించారు. కాకపోతే ఆ ఛాన్స్ జగన్ ఇవ్వలేదని అంటున్నారు.


ALSO READ:  ఆ స్కీమ్‌కు ఎన్టీఆర్ పేరే పెడదామా?.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే

బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ శకుని పాచికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందన్నారు. టీడీపీని ఎదుర్కొనేందుకు బొత్స లాంటి ప్రొఫైల్ వ్యక్తి, గట్టిగా నిలబడగలిగినవారు ఉండాలన్నారు. ఈ మాట మీరందరూ చెప్పడంతో బొత్స ఛాన్స్ ఇచ్చామన్నది అధినేత మాట.

నేతల అంత మాట ఇస్తే.. బుధవారం జరిగిన జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీని ఎందుకు గెలిపించుకో లేకపోయారన్నది అసలు ప్రశ్న. ఈ లెక్కన ఆ పార్టీలో ఏదో జరుగుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇప్పుడే కాదు.. పార్లమెంటు ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు బొత్స ఝాన్సీకి ఇచ్చినప్పుడే అంతర్గత విబేధాలు మొదలయ్యాయి. దాని ప్రభావం క్లియర్‌గా కనిపించింది. ఇప్పుడు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల వంతైంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలో అదే ఫలితం రిలీట్ అవుతుందని అంటున్నారు.

ఏళ్ల తరబడి తాము వైసీపీని నమ్ముకున్నామని, ఉన్నదంతా పార్టీకి పెట్టామని అంటున్నారు కొందరు నేతలు. ఎన్నికలు వచ్చేనాటికి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి నిలబడితే తాము ఎలా ఓట్లు వేస్తామన్నది కొందరు నేతల మాట. ఇప్పటికే చాలామంది జీవీఎంసీ కార్పొరేటర్ల జనసేన, టీడీపీలో చేరిపోయారు. ఇంకా తమకు బలం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దటీజ్.. జగన్.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×