BigTV English

Kuppam Woman Incident: కుప్పం మహిళ ఘటనలో.. నలుగురు అరెస్ట్..

Kuppam Woman Incident: కుప్పం మహిళ ఘటనలో.. నలుగురు అరెస్ట్..

Kuppam Woman Incident: చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడిచేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆ నలుగురుని మదనపల్లి సబ్‌ జైలుకు తరలించారు పోలీసులు.


కుప్పం నియోజకవర్గంలో అప్పు వసూలు కోసం.. మహిళను చెట్టుకు కట్టి కొట్టారు నిందితులు. మహిళపై అమానుషం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ శిరీషను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి మహిళను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని శిరీషకు సూచించారు. బాధిత మహిళలకు 5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలకు సీటు ఇవ్వాలని సీఎంని కోరింది బాధిత మహిళ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో.. సకాలంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేశారు. అసభ్య పదజాలంతో దూషించాడు.


గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త 80వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లుగా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా శిరీష భర్త తిమ్మరయప్ప ఆరు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేశాడు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. అంతేకాదు శిరీష కుమార్తు మధుశ్రీ వికలాంగ పింఛన్‌ను.. మూడు నెలలుగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటనపై డీఎస్పీ పార్థసారథి రియాక్ట్ అయ్యారు. నలుగురు నిందితులని అరెస్ట్ చేశామన్నారు. వాట్సాప్‌లో ఫోటో రాగానే ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీసినట్టు చెప్పారు. నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది ఏ రాజకీయ, కులానికి సంబంధించిన ఇష్యూ కాదని తేల్చి చెప్పారు. బాధితురాలు పిల్లల TC తీసుకోవడానికి గ్రామానికి రాగా.. నిందుతులు దౌర్జన్యంగా అడ్డుకొని చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగిందన్నారు. ఈఘటన ఆర్థిక లావాదేవిలా కారణంగానే జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు డీఎస్పీ పార్థసారథి.

Also Read: భర్త పరార్.. భార్యను చెట్టుకు కట్టేసి.. వడ్డీ వ్యాపారి ఏం చేశాడంటే..

కుప్పంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై.. స్పందించారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ. భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి చేయడం బాధాకరమన్నారు. బాధితురాలిని వీడియో కాల్‍లో పరామర్శించిన ఆమె.. ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు సిగ్గుచేటన్నారు. ఫోన్‌లో జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నరాయపాటి శైలజ బాధితులకు అండగా ఉండాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×