Bigg Boss 9:బిగ్ బాస్.. బిగ్ బ్రదర్ గా పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. ఆ తర్వాత హిందీలో 2006 నవంబర్ 3న ప్రారంభమై 2007 జనవరి 26న ముగిసింది.. ఈ రియాల్టీ షో ఒక హిందీ ఆడియన్స్ ను మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలను ఆకట్టుకుని, భాషతో సంబంధం లేకుండా ప్రతి భాష ప్రియుడు ఈ బిగ్ బాస్ షో ని చూడడం మొదలుపెట్టారు. దీంతో టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోయింది..ఇక హిందీలోనే చూడడం ఎందుకు తమ ప్రాంతీయ భాషల్లో కూడా ఇలాంటి షోలు చేస్తే బాగుంటుంది కదా అని ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ మేరకు టాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని సౌత్ ఇండియా భాషల్లో ప్రారంభమైంది.
2017 లో బిగ్ బాస్ తెలుగు షో ప్రారంభం..
అలా హిందీ లో వచ్చిన కొన్నేళ్లకు అంటే 2017 జూలై 16న తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మొదట ఎన్టీఆర్ (NTR)హోస్ట్ గా వ్యవహరించి.. షో టీఆర్పీ రేటింగ్ అమాంతం పెంచేశారు. అలా మొదలైన బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
హోస్ట్ గా భారీ సక్సెస్ అందుకున్న నాగార్జున..
ఒక రెండవ సీజన్ కి మాత్రమే నాని(Nani ) హోస్ట్ గా చేశారు. కానీ మూడవ సీజన్ మొదలు 8వ సీజన్ వరకు నాగార్జున (Nagarjuna).తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ తో.. కామెడీతో అటు కంటెస్టెంట్స్ ను ఇటు ఆడియన్స్ ను అలరిస్తూ హోస్ట్ గా భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కి కూడా ఆయనే హోస్ట్ కావడం గమనార్హం. నిజానికి గతంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా.. ఈ స్థానాన్ని నాగార్జున తప్ప మరెవరు భర్తీ చేయలేరు అనే మాట వాస్తవమని చెప్పవచ్చు.
సల్మాన్ ఖాన్ బాటలో నాగార్జున..
తాజాగా నాగార్జున తనకి ఉన్న డిమాండ్, ప్రజాదారణ, షో కి వస్తున్న టిఆర్పి రేటింగ్ ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ హీరో కం బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ (Salman Khan) దారిలో నడవబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం నాగార్జున సుమారుగా రూ.30 నుండి రూ.40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
గత సీజన్ల కోసం నాగ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
ఇక మునుపటి సీజన్లకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలను కాస్త పరిశీలించినట్లయితే.. తొలిసారి బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్టుగా వ్యవహరించారు నాగార్జున. ఈ కార్యక్రమానికి కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత సీజన్ 4 – రూ.6 కోట్లు , సీజన్ 5 – రూ.8 కోట్లు, సీజన్ 6 – 10 కోట్లు, సీజన్ 7 – 15 కోట్లు ఇలా ఒక్కొక్క సీజన్ కి పెంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచారు నాగార్జున. అయితే సీజన్ 8 కి మాత్రం ఏకంగా రూ.10 కోట్లు పెంచేశారు. పైగా స్టూడియో రెంట్ తో పాటు 8వ సీజన్ కి రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.
సీజన్ 9 కోసం భారీ డిమాండ్..
నిజానికి అన్నపూర్ణ స్టూడియో లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేశారు. కాబట్టి ఆ సెట్ కి రెంట్ కూడా వస్తుంది. అలా బిగ్ బాస్ సీజన్ 8 కి రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు అదనంగా రూ.5 కోట్లు రెంట్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు దాని విలువ పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం నాగార్జున తనకున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని రూ.40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని, అదనంగా సెట్ రెంట్ కూడా వస్తుంది కాబట్టి మొత్తం రూ.50 కోట్లు సీజన్ 9 (Bigg Boss 9)కోసం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.
నాగార్జున రిస్క్ లో పడనున్నారా?
ఇకపోతే నాగార్జున ఇలా రెమ్యూనరేషన్ పెంచడంతో.. నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే కానీ హీరోగా కాదు. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్ పెంచడం అవసరమా? ఆశ పడితే రిస్క్ లో పడతారేమో చూడండి గురూ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరికొంతమంది నాగార్జునకి భారీ డిమాండ్ ఉంది ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అడగడం తప్పు లేదని సపోర్ట్ చేస్తున్నారు.
ALSO READ:Tollywood Heroine: అవతల ఎంత తోపు అయినా.. ఆ హీరో కన్యరికం చేయకుండా ఆపడు.. బాంబు పేల్చిన హీరోయిన్!