kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేశారు. అసభ్య పదజాలంతో దూషించాడు.
గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త 80వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లుగా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా శిరీష భర్త తిమ్మరయప్ప ఆరు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేశాడు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
అంతేకాదు శిరీష కుమార్తు మధుశ్రీ వికలాంగ పింఛన్‌ను.. మూడు నెలలుగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కుప్పంలో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని సీఎం చంద్రబాబుకు ఎస్పీ చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని సీఎం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
కాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పు తీర్చలేదని మహిళను.. చెట్టుకు కట్టేసి దాడి చేశాడు ముని కన్నప్ప అనే వ్యక్తి. ఈ నేపథ్యంలో ఎస్పీతో ఈ ఘటనపై ఫోన్‌లో మాట్లాడారు సీఎం చంద్రబాబు. అసలేం జరగిందని ఆరా తీశారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు.
కుప్పంలో దాడికి గురైన మహిళను హోంమంత్రి అనిత పరామర్శించారు. కుప్పం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని అనిత.. వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి బాధితురాలికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
Also Read: రైతులకు లాస్ట్ ఛాన్స్.. రూ. 20 వేలు జమ అయ్యేందుకు ఇలా చేయండి!
మరోవైపు కుప్పంలో బాధిత మహిళ శిరీషను వీడియో కాల్‌లో పరామర్శించారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఆసుపత్రికి వచ్చి పలువురు టీడీపీ నాయకులు శిరిషతో మాట్లాడారు. శిరిష ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. శిరిష కుటుంబానికి అండగా ఉండాలని సీఎం ఆదేశించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం..
నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన వడ్డీ వ్యాపారి
మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు చేసిన శిరీష భర్త తిమ్మరాయప్ప
అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి వెళ్లిన తిమ్మరాయప్ప
దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు
కూలీ పని… pic.twitter.com/axJkO9lsRP
— BIG TV Breaking News (@bigtvtelugu) June 17, 2025