Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్ కంగారుగా అమర్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి సార్ రావు గారు, ప్రమీల గారు ఎక్కడున్నారో తెలిసింది సార్ అని చెప్తాడు. అమర్ ఎక్కడున్నారు అని అడుగుతాడు. రోడ్డు నెంబర్ సెవెన్‌లో పాడుబడిన బిల్డింగ్ లో ఉన్నారట సార్. ఆశ్రమం నుంచి వెళ్లిన కారు కూడా అటే వెళ్లిందట అని చెప్తాడు. అయితే సరే వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి వెళ్తారు. మరోవైపు మనోహరి బయటకు వెళ్తుంటే.. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్లినా అడిగేవాళ్లే లేరు అనుకుంటూ వెళ్తుంది. బయట గార్డెన్‌లో చూస్తున్న ఆరు కోపంగా అంతా దీనివల్లే జరుగుతుంది. ఇవాళ చిత్ర ఇంతదూరం వచ్చిందంటే అంతా దీనివల్లే అంటూ తిట్టుకుంటుండగా.. శివరాం అమ్మా మనోహరి అని పిలుస్తాడు.
మనోహరి తిరిగి చూడగా శివరాం, నిర్మల దగ్గరకు వస్తారు. అమ్మా మనోహరి బయటకు వెళ్తున్నావా..? అని నిర్మల అడుగుతుంది. దీంతో మనోహరి అవును ఆంటీ ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నాను. నేను లంచ్ బయటే చేస్తాను అని చెప్తుంది. అయితే మంచిది మనోహరి ఎలాగూ బయటకు వెళ్తున్నావు కదా మమ్మల్ని గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్లు అంటాడు శివరాం. షాకింగ్‌గా మనోహరి గుడా అని అడుగుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తూ ఏంటి గుడా అని అలా దీర్ఘం తీస్తావేంటి మను.. గుడికే.. గుడి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తావా..? అని అడుగుతుంది. దీంతో మనోహరి ఇప్పుడు గుడికి దేనికి..? అయినా గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో నిర్మల గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు అమ్మా.. మనసు ప్రశాంతంగా ఉండటానికి మనసులోని కోరికెలు తీర్చడానికి ఆ భగవంతుడిని వేడుకోవడానికి అని చెప్తుంది.
దీంతో మనోహరి అంటే ఇప్పుడు ఎందుకు అని ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయి కదా..? కావాలంటే ఆ పూజ ఏదో నేను చేయిస్తాను అంటుంది. దీంతో మిస్సమ్మ పూజ చేయాలంటే మంచి మనసు ఉండాలి మను. అది నీకెలాగూ లేదు. మమ్మల్ని వెంకటేశ్వర స్వామి గుడిలో డ్రాప్ చేసేసి నువ్వు వెల్లొచ్చు అంటుంది. వెంకటేశ్వర స్వామి గుడా అని అడుగుతుంది మను. దీంతో శివరాం ఏమైందమ్మా నీకు మేము ఏం మాట్లాడినా అంతలా ఉలిక్కిపడుతున్నావు అని అడుగుతాడు. అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు శివాలయంకు వెళ్దాం అంటుంది. సరే మను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం తర్వాత శివాలయానికి వెళ్దాం.. ఏమంటారు అత్తయ్యా అంటుంది మిస్సమ్మ.. ఎప్పుడు గుడికి కూడా రాని మనోహరి శివాలయం అని చెప్తుంది. అలాగే వెళ్దాం అని నిర్మల చెప్తుంది. లేటవుతుంది మను వెళ్దాం పద అంటూ అందరూ కారులో కూర్చుంటారు. అంతా గమనించిన ఆరు హమ్మయ్యా అందరూ అక్కడికే వెళ్తున్నారు. దేవుడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోయేలా చూడు స్వామి అనుకుంటుంది.
మరోవైపు గుడిలో చిత్రను కలుస్తాడు వినోద్. ఇద్దరూ కలిసి ప్రదిక్షణ చేస్తుంటారు. చిత్ర డల్లుగా కనిపిస్తుంది. ఎందుకు అలా ఉన్నావని వినోద్ అడుగుతాడు. ఇంతలో అక్కడ లవర్స్ పెళ్లి డ్రామా జరుగుతుంది. చిత్ర మరిత భయంతో మనోహరికి కాల్ చేస్తుంది. మనోహరి కాల్ లిఫ్ట్ చేయదు. మరోవైపు అమర్ పాడుబడిన బిల్డింగ్ దగ్గరకు వెళ్లి కిడ్నాపర్ల నుంచి రావు, ప్రమీలను సేవ్ చేస్తాడు. చిత్ర ఎల్లుండి తన తమ్ముడు వినోద్‌ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు. దీంతో ప్రమీల కగారుగా పెళ్లి ఎల్లుండి కాదు బాబు ఇవాళే అని చెప్తుంది. ఆ మాటలకు అమర్ షాక్ అవుతాడు.
మరోవైపు గుడిలో పూజారి తాళిబొట్టు పూజ చేసి చిత్రకు ఇస్తాడు. ఇది వెంటనే నీ మెడలో పడాలి అని చెప్తాడు. ఈ తాళి ఇంకాసేపట్లో నా మెడలో పడుతుంది పంతులు గారు అని చెప్తుంది చిత్ర. అమర్, మిస్సమ్మకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. మిస్సమ్మ షాక్ అవుతుంది. గుడిలో వినోద్ కోసం వెతుకుతుంది. అమర్, రావు, ప్రమీల, రాథోడ్ గుడికి బయలుదేరుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?